Horoscope Today August 30th 2022: నేటి రాశి ఫలాలు.. పట్టరాని కోపం ఈ రాశి వారి రిలేషన్‌షిప్‌కి శత్రువుగా మారే ఛాన్స్..

ఇవాళ మంగళవారం. మేష, వృషభ, సింహ తదితర రాశుల వారికి కలిసొస్తుంది. కొన్ని రాశుల వారిని కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 06:24 AM IST
  • ఇవాళ మంగళవారం.. హనుమాన్‌కి అంకితం చేయబడిన రోజు
  • హనుమంతుడిని పూజించడం ద్వారా శని బాధల నుంచి గట్టెక్కుతారు
  • మనోధైర్యం సిద్ధిస్తుంది.. మనసులోని కాంక్షలు నెరవేరుతాయి
Horoscope Today August 30th 2022: నేటి రాశి ఫలాలు.. పట్టరాని కోపం ఈ రాశి వారి రిలేషన్‌షిప్‌కి శత్రువుగా మారే ఛాన్స్..

Horoscope Today August 30th 2022: ఇవాళ మంగళవారం. మేష, వృషభ, సింహ తదితర రాశుల వారికి కలిసొస్తుంది. కొన్ని రాశుల వారిని కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా కొన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మొత్తంగా ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

మేష రాశి (Aries)

ఉద్యోగస్తుల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెట్టుబడులకు ఇవాళ అనుకూలం. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను ఎంచుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ప్లాన్స్, వ్యూహాలు అమలుచేస్తారు. రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న విషయాలకు పట్టింపులకు పోవద్దు. వాటిని పట్టించుకోకపోవడమే బెటర్. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడూ నైతిక విలువలను పాటిస్తారు.

వృషభ రాశి (Taurus)

వృత్తి రీత్యా అద్భుతంగా రాణిస్తారు. ఫోకస్ మొత్తం టార్గెట్‌పై ఉంటుంది. మీ పనితీరుకు రివార్డులు లభించవచ్చు. కొత్త జాబ్ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పని ఒకటి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. అనుకున్న సమయానికి దాన్ని పూర్తి చేయగలరు. అనవసర విషయాల కోసం టైమ్, ఎనర్జీ వేస్ట్ చేయవద్దు.

మిథున రాశి (GEMINI)

రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఒత్తిడికి లోనుకావొద్దు. మీ పార్ట్‌నర్‌తో మాట్లాడి ముందుకు సాగండి. ఇవాళ మీ బంధంలో ప్రేమత్వం మరింత పెరుగుతుంది. అదే సమయంలో పట్టరాని కోపం మీ రిలేషన్‌షిప్‌కి శత్రువుగా మారే ఛాన్స్ ఉంది. పనిలో పడిపోయి ఇంటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమపూర్వక బంధం కొనసాగేలా వ్యవహరించాలి.

కర్కాటక రాశి (Cancer) 

కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. సోదరులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. ఏ విషయంలోనైనా ముందుచూపుతో వ్యవహరిస్తారు. మీ సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి (LEO)

మీ మాటంటే అందరికీ నమ్మకం ఏర్పడుతుంది. అది సొసైటీలో మీ పట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా చేస్తుంది. ఇవాళంతా పనిలో తీరిక లేకుండా గడుపుతారు. చేపట్టిన పనిని మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం మెండుగా ఉంది. శత్రువులు మీ వ్యవహారాల్లోకి చొరబడకుండా జాగ్రత్తపడాలి.

కన్య రాశి (Virgo)

చాలాకాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం నయమవడం మీకు బిగ్ రిలీఫ్ ఇస్తుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది. కెరీర్, బిజినెస్ వ్యవహారాలు ఊపందుకుంటాయి. కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇవాళంతా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతుంది. వ్యక్తిగత వ్యవహారాలు మూడో వ్యక్తి దాకా తీసుకెళ్లవద్దు.

తులా రాశి (Libra)

ఆర్థికంగా కలిసొస్తుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించి వివాదాలు తొలగిపోతాయి. మార్కెటింగ్ లేదా మేనేజ్‌మెంట్ వ్యవహారాలు చూసుకునేవారికి మంచి ఆదాయం వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వచ్చంద సేవా సంస్థల తరుపున సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందకు స్మార్ట్ పద్దతులను అనుసరిస్తారు.

వృశ్చిక రాశి (Scorpio)

ఇతరుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పనుల పట్ల అశ్రద్ధ తగదు. అప్పగించిన పనిని బాధ్యతతో పూర్తి చేయాలి. ప్రస్తుతం సమయం మీకు అనుకూలంగా ఉంది. మీ ప్రవర్తన ఇప్పటిలాగే కొనసాగితే మీకు విజయాలు సొంతమవుతాయి. అందులో సందేహం అక్కర్లేదు. పని ప్రదేశంలోనే ఎక్కువ సమయం గడుపుతారు. అత్యవసర విషయాల్లో వేగవంతంగా స్పందించడం, పనిచేయడం నేర్చుకుంటారు.

ధనుస్సు రాశి (Sagittarius)  

ప్రేమ వ్యవహారాలు సాఫీగా ముందుకు సాగుతాయి. పాత స్నేహితుడు ఒకరిని కలుసుకుంటారు. పెళ్లి ప్రతిపాదనలకు ఇవాళ అనుకూలమైన రోజు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత వ్యవహారాలపై ఫోకస్ పెంచుతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. అన్ని విషయాల పట్ల క్లారిటీతో ఉంటారు.

మకర రాశి (Capricorn) 

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం వల్ల కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్, డయాబెటీస్‌తో బాధపడేవారు ఫుడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జంక్ ఫుడ్ తీసుకోవద్దు. ప్రస్తుతానికి అన్నీ పక్కనపెట్టి ఆరోగ్యంపై ఫోకస్ చేయండి. బిజినెస్, కెరీర్ ఆశాజనకంగా సాగుతాయి.

కుంభ రాశి (Aquarius)

ఇవాళ మీకు సక్సెస్‌ఫుల్ డే అవుతుంది. ఏ పని చేపట్టినా పూర్తి చేసి తీరుతారు. ఆర్థికంగా కలిసొస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్లాన్‌లో ఉంటారు. పని ప్రదేశంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. రక్త సంబంధీకుల మధ్య బంధం మరింత బలపడుతుంది. మీ మాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రియమైనవారితో కలిసి మాట్లాడే అవకాశం చిక్కుతుంది. 

మీన రాశి (Pisces) 

మీలో స్వార్థం తొలగిపోతుంది. ఇతరులకు సాయం చేసే మనస్తత్వం పెరుగుతుంది. మీ క్లోజ్ ఫ్రెండ్ సమస్యను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయి. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్లాట్స్ కొనుగోలు, బిల్డింగ్ నిర్మాణ పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ముఖ్యమైన పనులను పెండింగ్‌లో ఉంచవద్దు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు..31న బీహార్‌కు గులాబీ నేత..!

Also Read: CM Kcr: బీజేపీ ముక్త్ భారత్‌కు అంతా కలిసి రావాలి..ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News