Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 06 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వస్తులాభాలు

Horoscope Today In Telugu 06 July 2021: తమ ఖర్చులను నేడు అదుపులో ఉంచుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో చింతించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నామని బాధపడతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2021, 08:00 AM IST
Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 06 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వస్తులాభాలు

Horoscope Today 06 July 2021: శ్రీ ప్లవ నామ సంవత్సరం జులై 06వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మేష రాశివారు నేడు కొంచెం నీరసంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ మీరు ప్రశాంతంగా మరియు పాజిటివ్‌గా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయండి. మీకు అప్పగించిన కొత్త ప్రాజెక్టుల వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయి. ఆస్తిలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్చులు అధికం కానున్నాయి.

వృషభ రాశి
వ్యక్తిగత విషయాలపై దృష్టిసారించడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ రోజు కాస్త మెరుగుపడటంతో ప్రశాంతంగా ఉంటారు. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ప్రయాణానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. కొంతమంది సహోద్యోగుల గైర్హాజరి కారణంగా పనిలో ఒత్తిడి అధికం అవుతుంది. 

Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

మిథున రాశి
ఈరోజు కుటుంబసభ్యులకు అధిక సమయాన్ని కేటాయిస్తారు. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, అందుకు నేడు చాలా మంచి రోజు. గతంలో చేసిన పెట్టుబడులు లాభాల్ని అందిస్తాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. 

కర్కాటక రాశి 
ఈరోజు అన్ని విధాలుగా మీకు కలిసొస్తుంది. మీ అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ రోజు ఇంట్లో ఉండి పని చేయడం ద్వారా మేలు జరుగుతుంది. మీ తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో ఎక్కువ సమయం గడపుతారు. కొన్ని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 

సింహ రాశి
కుటుంబ సమస్యలు ఆఫీసు పనులపై ప్రభావం చూపుతాయి. కెరీర్‌లో ఎదగాలనుకునే వారు కొత్త వెంచర్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంటారు. కొంతకాలనికి లాభాలు అందుకుంటారు. పిల్లల చదువు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అవివాహితులకు వివాహానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఉద్యోగులకు ఆశించిన విధంగా ఫలితాలు వస్తాయి.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

కన్య రాశి
కన్య రాశివారు తమ ఖర్చులను నేడు అదుపులో ఉంచుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో చింతించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నామని బాధపడతారు. అధికంగా శ్రమించినా ఫలితం వస్తుందా లేదా అని ఎదురుచూడాల్సి వస్తుంది. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.

తులా రాశి
ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ పని సాధారణం కంటే వేగంగా పూర్తవుతుంది. మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం దొరుకుతుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకోవాలి. వ్యాపారులకు, ఉద్యోగులకు సాధారణ ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి 
నేడు పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీరు కొత్త విషయాలు తెలుసుకోవాలిన భావిస్తారు, కాబట్టి మీకు సహాయం చేసే ఓ కంపెనీ నుంచి సలహా తీసుకుంటారు. పిల్లల ఆరోగ్యం ఈ రోజు ఒక సమస్య కావచ్చు. కనుక వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారులు షేర్ మార్కెట్స్‌లో  స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటారు.

Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు

ధనుస్సు రాశి
ఈ రాశి విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. వ్యక్తిగత విషయాలకు సమయాన్ని కేటాయిస్తే ప్రయోజనం కలుగుతుంది. మీకు అప్పగించిన అన్ని పనులను పూర్తి చేయడానికి మీరు ఆతురుతగా ఉండవచ్చు, సహోద్యోగుల నుండి సహాయం తీసుకుని వాటిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. 

మకర రాశి
చేపట్టే పనులలో స్వల్ప అవాంతరాలు తలెత్తుతాయి. మీ చుట్టూ సానుకూల పరిస్థితులు తీసుకురావడానికి కుటుంబంతో కొంత సమయం గడుపుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారులు మీ రోజును ప్రారంభిస్తారు. దీని వల్ల లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం శ్రేయస్కరం. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.

కుంభ రాశి
ఈ రోజు పని కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా వ్యక్తిగత పనులను వాయిదా వేసుకుంటారు. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతు తెలుపుతారు. ఆఫీసులో కొన్ని విషయాలలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత అధికంగా ఉంటుంది. ఉన్నత చదువులు, కెరీర్ గురించి ఆలోచిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మీన రాశి
కొత్త ఇంటి కోసం అన్వేషణ మొదలుపెడతారు. విద్యార్థులు తదుపరి ఏం చేయాలన్న అంశంపై తీవ్రంగా ఆలోచిస్తారు. ఇటీవల చేపట్టిన ప్రాజెక్ట్ విషయంపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలం తరువాత కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News