Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 30 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారికి అనారోగ్య సమస్యలు

Horoscope Today In Telugu 30 June 2021: మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. వెంచర్లు లేదా స్థిరాస్తి గురించి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు. ఆదాయాన్ని మించిన ఖర్చులు చేసిన ఆర్థిక సమస్యలలో చిక్కుకుంటారు. బడ్జెట్ అంచనా వేయలేకపోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2021, 08:10 AM IST
Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 30 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారికి అనారోగ్య సమస్యలు

Horoscope Today In Telugu 30 June 2021: మేష రాశి
గతంలో మిమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నించిన వ్యక్తులను మీరు క్షమిస్తారు. యువతకు సరైన మార్గనిర్దేశం చేస్తారు. చిన్న చిన్న పనులు సైతం జీవితాన్ని తలకిందులు చేస్తాయని వారికి వివరిస్తారు. నేడు వాహనయోగం. మీ సహచరుడితో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలకు లాభసాటిగా ఉంటుంది.

వృషభ రాశి
నేడు మీ మనసు పలుమార్లు మార్చుకునే అవకాశాలున్నాయి. మీరు ఓ విషయంలో మార్పులకు లోనవుతారు. స్థిరమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. అందుకోసం మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు విలువ ఇస్తారు. మీ సొంత అభిప్రాయాలను నమ్ముకోవం ద్వారా ఫలితాలు పొందుతారు.

Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు

మిథున రాశి
మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. వెంచర్లు లేదా స్థిరాస్తి గురించి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు. ఆదాయాన్ని మించిన ఖర్చులు చేసిన ఆర్థిక సమస్యలలో చిక్కుకుంటారు. బడ్జెట్ అంచనా వేయలేకపోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీరు ఓపికగా వ్యవహరిస్తే విజయాలు అందుకుంటారు. ప్రయాణాలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కర్కాటక రాశి 
మీరు కుటుంబ సభ్యులకు, బంధువులకు నేడు అధిక ప్రాముఖ్యత ఇస్తారు, అయినప్పటికీ కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఇతర పనులపై దృష్టి పెట్టలేరు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.

సింహ రాశి
కొత్త విషయాలను కనుగొనడానికి నిరంతరం సిద్ధంగా ఉంటారు. ఇతరుల సాయాన్ని మీరు మరిచిపోకూడదు. ఒంటరిగా పనులు పూర్తి చేయడం సాధ్యం కాదు. నేడు మీకు ఆర్థికంగా కలిసొస్తుంది. కనుక విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

కన్య రాశి
గతంలో మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో గడపటానికి సమయాన్ని కేటాయిస్తారు. 
మీరు వారికి ఎంతో ప్రేమను అందించాలని మరియు అవసరమని తల్లిదండ్రులు భావిస్తారు. కుటుంబ బారాన్ని మీరు కూడా ఓ భాగం తీసుకుంటారు. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

తులా రాశి
మీరు సాధారణంగానే ప్రతి విషయంలోనూ మంచి ఆశిస్తారు. ఏ విషయంలోనూ అధికంగా ఆలోచించకుండా శాంతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ఈరోజు కొంత సమయం ధ్యానం చేయడానికి కేటాయించాలి. మీ జీవిత భాగస్వామితో కొన్ని కీలక విషయాలు చర్చిస్తారు.

వృశ్చిక రాశి 
మీరు ప్రతి విషయంలోనూ హేతుబద్ధత ఉండాలని కోరుకునే తత్వం కలిగి ఉన్నారు. ప్రత్యర్థులు లేదా విరోధులచే పరిష్కారం కనుగొనలేని వ్యక్తిత్వంతో ఉంటారు. మీరు దౌర్జన్యాన్ని ఎలా ఎదుర్కొనాలో గుర్తించాలి. ప్రయాణాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి కొనసాగుతోంది. 

ధనుస్సు రాశి
అనవసరమైన వస్తువులు, సేవలకు ధనాన్ని వెచ్చిస్తారు. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. వినూత్న విధానాలతో లాభాలు పొందాలని ఆలోచిస్తారు. అవయవదానం చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. కష్టపడి పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది. కెరీర్ లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

మకర రాశి
మీరు ఇతరులకు సహాయపడటానికి నిరంతరం సిద్ధంగా ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు ఈ పరిస్థితిని అవకాశంగా వాడుకోవాలని ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులను విశ్వసించకూడదని మీ బంధువులకు సైతం సూచిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

కుంభ రాశి
మీ నుంచి ఎవరైనా ఆశిస్తున్న పని గురించి మీరు కొంత ఆందోళనకు గురవుతారు. మీరు ప్రాథమికంగా అతిగా ఆలోచిస్తారు. ఇది అంత పెద్ద పరీక్ష కాదని తరువాత అంగీకరిస్తారు. కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరీక్షలు, కెరీర్ విషయంలో విద్యార్థులు శుభవార్తలు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

మీన రాశి
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం ఉత్తమమని కుటుంబసభ్యులు సూచిస్తారు. ఖర్చులు అధికం కానున్నాయి. మీకు విలువ ఇవ్వని వ్యక్తులను సంప్రదించవద్దు. కొన్ని విషయాలలో ఆందోళనకు గురవుతారు. గతంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి అధికం అవుతుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News