Horoscope Today January 9 2022: నేటి రాశి ఫలాల్లో కొన్ని రాశుల వారికి పూర్తి అనుకూల సమయం. చాలాకాలం క్రితం దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉండొచ్చు. కొన్ని రాశుల వారికి సంపాదన పెరగడంతో పాటు అన్ని బంధాలు మరింత మెరుగవుతాయి. ఇవాళ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...
మేషం : ఇవాళ మీ కలలు నిజమయ్యే రోజు. పని ప్రదేశంలో ఒకరితో కొంత ఇబ్బందులు తప్పవు. మీ వ్యక్తిగత లేదా ఉద్యోగపరమైన విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోండి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకండి. లక్కీ కలర్: జేడ్, లక్కీ నంబర్: 9
వృషభం : మీ ప్రియమైన వ్యక్తుల పట్ల ఇవాళ మీరు కొంత కఠినంగా ఉండే అవకాశం. అయితే సమస్యకు ఎప్పుడూ రెండువైపులా కారణాలు ఉంటాయని గ్రహించాలి. ఉద్యోగ, వ్యాపార పరంగా పూర్తి అనుకూల సమయం. లక్కీ కలర్ : వయొలెట్, లక్కీ నంబర్ : 2
మిథునం : రెగ్యులర్ వర్క్స్ నుంచి కాస్త రిలాక్సేషన్ కోరుకుంటారు. అలా చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. కొన్ని విషయాల్లో మీ భాగస్వామి మీకు ప్రేరణగా నిలుస్తుంది. ఇతరులతో డీల్ చేసే వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. సోషల్ గెట్ టు గెదర్ ద్వారా కొత్త స్నేహితులు, మేదావులు పరిచయమవుతారు. లక్కీ కలర్ : క్రీమ్, లక్కీ నంబర్ : లక్కీ
కర్కాటకం : వ్యాపార పరంగా పూర్తిగా అనుకూల సమయం. మీరు మొదలుపెట్టిన జాయింట్ వెంచర్స్ పురోగతిలో ఉంటాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. లక్కీ కలర్ : Terracotta, లక్కీ నంబర్ : 1
సింహం : మీకు మంచి మిత్రుడిగా ఉన్న వ్యక్తి ఒకరు కొన్ని విషయాల్లో మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. అతను మీకు వ్యతిరేకిగా మారవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ ఎమోషన్స్‌ను డామినేట్ చేస్తుంది. కొన్ని విషయాల్లో సంయమనంతో ముందుకు సాగాలి. లక్కీ కలర్ : వైట్, లక్కీ నంబర్ : 7
కన్య : కొన్ని విషయాల్లో మౌనం మంచిది కాదు. ప్రశ్నలు అడిగి తెలుసుకునే హక్కు మీకు ఉంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం చిక్కుతుంది. కొద్దిరోజులుగా మీకు దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరవుతారు. వారితోనూ సంతృప్తికరమైన సమయం గడుపుతారు. లక్కీ కలర్ : ఎమరాల్డ్, లక్కీ నంబర్: 4
తుల : మీరు గతంలో సహాయం చేసిన పాత కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మీ లక్ష్యాల నుంచి దృష్టి మరల్చకండి. సహాయం అడిగేందుకు భయపడవద్దు. మీ ప్రియమైన వ్యక్తుల నుంచి సహకారం లభించకపోవచ్చు. లక్కీ కలర్ : బ్రౌన్, లక్కీ నంబర్ : 5
వృశ్చికం: ఉద్యోగ, వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది. విద్యా సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సంపాదన పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఆచీ తూచీ మాట్లాడటం అలవరుచుకోండి. లక్కీ కలర్ : గోల్డ్, లక్కీ నంబర్: 8
ధనుస్సు : . మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చెడు స్నేహాలతో కొంత ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యపరంగా ప్రత్యేక జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో రాణిస్తారు. వైద్యులు, న్యాయవాదులు, టెక్నాలజీ నిపుణులకు పూర్తి అనుకూల సమయం. లక్కీ కలర్ : రెడ్, లక్కీ నంబర్ : 6
మకరం : మీ సంతానంలో ఒకరికి ఉద్యోగం లభించే అవకాశం. పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నవారికి మంచి సంబంధం దొరికే అవకాశం. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబపరంగా అన్ని విధాలా మీకు మద్దతు, సహకారం ఉంటుంది. లక్కీ కలర్ : స్కార్లెట్, లక్కీ నంబర్ : 4
కుంభం : కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గతంలో మీ ధోరణితో దూరమైన వ్యక్తులు మళ్లీ మీకు దగ్గరవుతారు. కొన్ని విషయాల్లో సహనం అవసరం. లక్కీ కలర్: ఆరెంజ్, లక్కీ నంబర్: 2
మీనం : వృత్తిపరమైన విషయాల్లో ఆచీ తూచీ వ్యవహరించండి. అందరి సలహాలు, సూచనలు స్వీకరించండి. కొన్ని నిర్ణయాల కారణంగా మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాలపై శ్రద్ధ పెట్టండి. లక్కీ కలర్ : ఇండిగో, లక్కీ నంబర్: 5
Also Read: Ramesh Babu: రమేష్ బాబు నటనకు ఎందుకు దూరమయ్యారు.. హీరోగా ఎందుకు విఫలమయ్యారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి