Horoscope Today July 29th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి దూరమైన బంధుమిత్రులు మళ్లీ దగ్గరవుతారు..

Horoscope Today July 29th 2022: : ఇవాళ శుక్రవారం. శ్రీమహా లక్ష్మికి అంకితం చేయబడిన రోజు. హిందువులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవతను కొలుస్తారు. తద్వారా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2022, 06:43 AM IST
  • ఇవాళ శుక్రవారం.. మహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు
  • మహాలక్ష్మి అనుగ్రహంతో మనసులో కోరుకున్న కోర్కెలకు మోక్షం కలుగుతుంది
  • ఈ వుక్రవారం ఎవరి జాతక ఫలం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today July 29th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి దూరమైన బంధుమిత్రులు మళ్లీ దగ్గరవుతారు..

Horoscope Today July 29th 2022: ఇవాళ శుక్రవారం. శ్రీమహా లక్ష్మికి అంకితం చేయబడిన రోజు. హిందువులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవతను కొలుస్తారు. తద్వారా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. మరి ఈ శుక్రవారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

ఇవాళ మీకు చంద్ర అనుగ్రహం లభిస్తుంది. రోజంతా హ్యాపీగా ఉంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యాపారంలో బాగా ఉపయోగపడుతాయి. మీ స్కిల్స్ క్లయింట్స్‌ను ఇట్టే ఆకర్షించేలా ఉంటాయి. ఓ పెద్ద కంపెనీ నుంచి ఇవాళ మీకు పెద్ద ఆర్డర్ అందుతుంది. అందుకు గాను అడ్వాన్స్ అందుకుంటారు. చెప్పిన టైమ్‌ లోగా వారికి ప్రొడక్ట్‌ను డెలివరీ చేస్తారు. మీ పార్ట్‌నర్స్ నుంచి తగిన సహకారం లభిస్తుంది.

వృషభ రాశి (Taurus)

చంద్ర అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇవాళ మీకు శుభదినం. మీ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి.మునుపటికన్నా వేగంగా పనులను చక్కబెట్టగలరు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ప్లాన్స్ చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువతకు ఎట్టకేలకు జాబ్ దొరుకుతుంది. ప్రేమ జంటలు అనవసర విషయాలపై చర్చించి మనస్పర్థలు తెచ్చుకోవద్దు.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీకు కలిసిరాదు. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ బాధిస్తాయి. అది మిమ్మల్నితీవ్ర విచారానికి గురిచేస్తుంది. తొందపరపాటులో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఇవాళ మీరు ధనాన్ని పోగొట్టుకునే సూచనలున్నాయి. వీలైనంతవరకు ఇల్లు కదలకపోవడం మంచిది. ఏదైనా క్లిష్ట నిర్ణయం తీసుకోవాలనుకుంటే కుటుంబ సభ్యులతో చర్చించండి.

కర్కాటక రాశి (Cancer) 

చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. అది మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు.పని విషయంలో కొన్ని సత్వర నిర్ణయాలు కలిసొస్తాయి. సమీప భవిష్యత్తులో మంచి లాభాలకు అది కారణమవుతుంది. వ్యాపారస్తులు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని దాన, ధర్మాలకు వెచ్చిస్తారు. పేద పిల్లల చదువుకు ఎంతో కొంత సాయం చేస్తారు.

సింహ రాశి (LEO)

వృత్తిపరంగా తీరిక లేకుండా గడుపుతారు. మీకున్న నెట్‌వర్క్‌తో అనుకున్న ప్లాన్స్‌ను అనుకున్నట్లు ఆచరణలో పెట్టగలరు. తద్వారా ఉద్యోగపరంగా మీ పట్ల గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ బాస్ మీ పనితనానికి మెచ్చి ప్రమోషన్ ప్రకటించవచ్చు. వ్యాపారంలోనూ మీరు అమలుచేసే కొత్త వ్యూహాలు మీకు లాభాలను తీసుకొస్తాయి. డబ్బు రాబడి మీలో గర్వాన్ని పెంచే అవకాశం లేకపోలేదు. అది మంచిది కాదని గుర్తించండి.

కన్య రాశి (Virgo)

చంద్ర అనుగ్రహం కలుగుతుంది. అది మిమ్మల్ని సంతోషంగా గడిపేలా చేస్తుంది. గత వారం మిమ్మల్ని వెంటాడిన కష్టనష్టాలు తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏదో ఒక రూపంలో మీకు అందుతుంది. అనుకోని వ్యక్తి నుంచి మీకు డబ్బులు అందే అవకాశం ఉంటుంది. చాలాకాలంగా దూరంగా ఉంటున్న బంధుమిత్రులు మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది.

తులా రాశి (Libra)

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బిజినెస్‌పరంగా పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. లేనిపక్షంలో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి ఉండవకపోవచ్చు. కొత్త వెంచర్స్ ప్రారంభానికి ప్రతికూల సమయం. గతంలో వచ్చిన లాభాలు కూడా ఇప్పుడు నష్టాల  రూపంలో కరిగిపోతాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితిని గ్రహించి అందుకు అనుగుణంగా నడుచుకోవాలి.

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. చేపట్టిన పనిని వేగంగా పూర్తి చేయగలరు. వ్యాపారంలో సత్వర నిర్ణయాలు మీ చతురతను చాటి చెబుతాయి. అది మీ కొలిగ్స్‌కి ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే సమయంలో మీ తెలివితేటలు వారిని ఆకర్షిస్తాయి. మీ మనస్తత్వం, తెలివితేటలు మెచ్చి ఎవరైనా అమ్మాయి లేదా అబ్బాయి మీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో దిగాలనుకునేవారు సొంతంగా ముందుకెళ్తే మంచిది.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళ పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. చంద్రుడి అనుగ్రహంతో పాత అనారోగ్య సమస్యలు నయమవుతాయి. చాలాకాలంగా మీ డబ్బులు మీకివ్వకుండా వేధిస్తున్న వ్యక్తులు తమంతట తామే ఆ డబ్బులు తిరిగిస్తారు. మీ నెట్‌వర్క్ విస్తరించడం వల్ల మీతో పెట్టుకోవద్దనే ధోరణిలో ప్రత్యర్థులు ఉంటారు. గతం కన్నా మీ ఆలోచనలు మరింత పాజిటివిటీతో ఉంటాయి.

మకర రాశి (Capricorn) 

గురు అనుగ్రహం కలుగుతుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లే సద్వినియోగం చేసుకోవాలి.లేనిపక్షంలో అవకాశం చేజారక బాధపడాల్సి వస్తుంది. ప్రేమికులు మధురమైన క్షణాలు గడుపుతారు. పెళ్లి విషయంలో పెద్దల నిర్ణయం ఆందోళనకు గురిచేయవచ్చు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతారు.

కుంభ రాశి (Aquarius)

మీ అహమే మీకు శత్రువుగా మారుతుంది. మీ మాట తీరు ఎదుటువారిని బాధపెడుతుంది. క్రమంగా అందరూ మీకు దూరమవుతారు. ఇవాళ కూడా మీ మాట తీరు కారణంగా లేనిపోని చిక్కులు కొనితెచ్చుకుంటారు. కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవడం, ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. లేనిపక్షంలో వివాదాలతో సహవాసం చేస్తారు.

మీన రాశి (Pisces) 

ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. పనిలో ఒళ్లు దాచుకోకుండా కష్టడుతారు. ఆస్తి తగాదాలు, వివాదాలు పరిష్కారమవుతాయి. తోబుట్టువులతో అనుబంధం పెరుగుతుంది.అనుకోకుండా ఓ వ్యక్తిని కలవడం మీ ఆలోచనల్లో మార్పు తీసుకొస్తుంది. ప్రపంచం పట్ల మీ దృక్పథం మారిపోతుంది. ఏ పనిచేసినా పూర్తి అధ్యయనం, స్పష్టతతో ముందుకెళ్తారు. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Ramarao on Duty: రామారావు ఆన్ డ్యూటీ లీక్డ్ వీడియో.. అధికార పార్టీకి మాస్ వార్నింగ్

Also Read : Viral Video: యూపీ టీచర్ నిర్వాకం.. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News