Viral Video: యూపీ టీచర్ నిర్వాకం.. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్..

Viral Video of Student Massages Teacher: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్ చేయించుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 28, 2022, 04:03 PM IST
  • యూపీ టీచర్ నిర్వాకం
  • క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Viral Video: యూపీ టీచర్ నిర్వాకం.. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్..

Viral Video of Student Massages Teacher: ఆమె ఓ ప్రభుత్వ టీచర్... క్లాస్ రూమ్‌లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయురాలు పిల్లలతో మసాజ్ చేయించుకుంటోంది. క్లాస్ రూమ్ చైర్‌లో కూర్చొని ఓ విద్యార్థితో ఆమె చేతులు నొక్కించుకుంటున్న వీడియో తాజాగా వెలుగుచూసింది. దీంతో సదరు టీచర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుస్తక పాఠాలు పక్కనపెట్టి ఈ మసాజ్ పాఠాలేంటని నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి పట్టణంలో ఉన్న పోఖరీ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న ఊర్మిలా సింగ్ ఈ నిర్వాకానికి పాల్పడింది. క్లాస్‌ రూమ్‌లో తాపీగా కూర్చొన్న ఆమె.. ఓ విద్యార్థిని పిలిచి అతనితో మసాజ్ చేయించుకుంది. క్లాస్ రూమ్‌లోనే ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఊర్మిలా సింగ్‌పై ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.

గతంలో ఇదే యూపీకి చెందిన ఓ ఇంగ్లీష్ టీచర్ వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది. స్కూల్లో జిల్లా మెజిస్ట్రేట్ తనిఖీల సందర్భంగా ఆ ఇంగ్లీష్ టీచర్ టెక్స్ట్ బుక్‌లోని లైన్స్‌ను కూడా సరిగా చదవలేకపోయింది. చూస్తూనే చదివినా సెంటెన్సెస్ సరిగా పలకడంలో తడబడింది. దీంతో ఆ అధికారి టీచర్‌పై మండిపడ్డారు. యూపీలో విద్యా వ్యవస్థకు ఇది అద్దం పడుతోందంటూ ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేశారు.

Also Read: Vikranth Rona: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ.. ప్రేక్షకులను ఆకట్టుకుందా?

Also Read: Goa Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!  

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News