Lakshmi Devi Blessings: జీవితంలో సుఖ సంతోషాలుండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. లక్ష్మీదేవి కటాక్షం నిత్యం ఉంటే అదే జరుగుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట సదా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
జీవితంలో సదా సంతోషంగా, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనేది ప్రతి ఒక్కరి ఆశ. దీనికోసం అహర్నిశలూ కష్టపడుతుంటారు. దైవ ప్రార్ధనల్లో గడుపుతుంటారు. అంతచేసినా ఒక్కోసారి కోరినవి నెరవేరవు. ధన సంపద లభించదు. జ్యోతిష్యశాస్త్రంలో చెప్పిన కొన్ని పద్ధతుల్ని పాటిస్తే..లక్ష్మీదేవి కటాక్షం సదా మీపై ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
లక్ష్మీదేవికి కమలమంటే చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కమలం గుత్తును ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా పర్సులో పెట్టుకోవాలి. దాంతోపాటు గోమతీ చక్రం కూడా పర్సులో ఉంచుకుంటే..ధనలాభం కలుగుతుంది. జేబులో గోమతి చక్రం, రావి ఆకు చిరిగిపోతే..వెంటనే ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి. ఆ తరువాత ఈ వస్తువుల్ని పూర్తిగా నిష్ఠతో పూజచేసి తిరిగి పర్సులో ఉంచాలి. దాంతోపాటు జేబులో ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్లీల ఫోటోలు పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రావిచెట్టు లక్ష్మీదేవి, విష్ణు భగవానుల ఆవాసం. అందుకే ధనలాభం కోసం శనివారం నాడు రావిచెట్టు ఆకును ఇంటికి తీసుకురావాలి. ఆ తరువాత రావిచెట్టు ఆకుని నారాయణ మంత్రంతో అభిషేకించి పర్సులో పెట్టుకోవాలి. దీనివల్ల డబ్బు సంబంధిత కష్టాలు తొలగిపోతాయి. ఒకవేళ మీ జీవితంలో అంతులేని డబ్బు, సంపద కావాలనుకుంటే..లక్ష్మీదేవి పూజలో కొన్ని పద్ధతులు గుర్తుంచుకోవాలి. ఆ పద్ధతుల ప్రకారం నియమ నిష్టలతో పూజలు చేస్తే ధనలాభం కలుగుతుంది. అయితే..మరొకర్ని నాశనం చేసేందుకు ఈ పద్ధతులు పాటించకూడదు.
ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి గవ్వలు చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు. పౌరాణిక కథల ప్రకారం లక్ష్మీదేవి, గవ్వలు సముద్ర మథనం సందర్భంగా ప్రత్యక్షమైనవే. అందుకే పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి గవ్వలు సమర్పిస్తే త్వరగా ప్రసన్నురాలవుతుంది. ఆ తరువాత లక్ష్మీదేవి కటాక్షం సదా ఉండాలని ప్రార్ధనలు చేయండి.
Also read: Pradosha vratham 2022: ఆషాఢంలోని ప్రదోష వ్రతం మహత్యమేంటి, ముహూర్తం, తేదీ ఎప్పుడు, ఏం చేయాలి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook