July Grah Rashi Parivartan 2023: గ్రహాల సంచారం పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనది. వచ్చే నెలలో 5 గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఈ గ్రహాల సంచారం సమయంలో కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు.
అంగారకుడి సంచారం
జూలై నెల అంగారకుడి సంచారంతో మెుదలుకానుంది. వచ్చే నెల 1వ తేదీ తెల్లవారుజామున 1.52 గంటలకు కుజుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారక గ్రహాన్ని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. దైర్యాన్ని ఇచ్చే కుజుడు సంచారం వల్ల మిథునం, కర్కాటకం, సింహం, తులారాశి, వృశ్చికం, ధనుస్సు మరియు కుంభం రాశి వారు జూలైలో స్పెషల్ బెనిఫిట్స్ పొందనున్నారు.
శుక్రుడి రవాణా
జూలై 7న శుక్రుడు సూర్యుని రాశి అయిన సింహరాశిలో సంచరిస్తాడు. ఇది తెల్లవారుజామున 3.59కి జరగనుంది. శుక్ర సంచార సమయంలో కొన్ని రాశులవారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. శుక్ర సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మరియు తులా, మకరం మరియు కుంభరాశి వారు మంచి ఫలితాలను పొందనున్నారు.
బుధుడి గోచారం
జూలై 8, 2023, ఉదయం 12.05 గంటలకు బుధుడు కర్కాటకంలో సంచరిస్తాడు. మెర్క్యురీ కమ్యూనికేషన్ మరియు మేధస్సుకు కారకుడిగా భావిస్తారు. బుధుడి రాశి మార్పు వృషభం, కన్యారాశి, తులారాశి, మీనం రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇదే నెల 25న బుధుడు మళ్లీ రాశిని మార్చనున్నాడు. ఇతడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశఇస్తాడు. దీని వల్ల మిథున, తుల, ధనుస్సు రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Also read: Venus Transit 2023: సింహరాశి ప్రవేశం చేయనున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు లాభాలు షురూ..!
సూర్యుడి రాశి మార్పు
ప్రతి నెల సూర్యుడు తన రాశిని మారుస్తాడు. జూలై 16న తెల్లవారుజామున 4.59 గంటలకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. గౌరవం మరియు ప్రతిష్టలకు కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. ఆదిత్యుడి సంచారం వల్ల మేషం, వృషభం మరియు తుల వారు శుభఫలితాలను పొందుతారు. మీ కెరీర్ ఉన్నతస్థాయికి చేరుకుంటుంది.
Also read: Benefits of Vipreet Rajyog: 'బుధుడు' రాశిలో వ్యతిరేక రాజయోగం.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook