July Horoscope 2022: ఆ మూడు రాశులకు జూలై 2 తరువాత మారనున్న అదృష్టం, డబ్బే డబ్బు

July Horoscope 2022: ప్రతి నెలా గ్రహాలు, నక్షత్రాల స్థానచలనం అన్ని రాశులవారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అదే విధంగా జూలై నెలలో కూడా కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుందట.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2022, 08:42 PM IST
July Horoscope 2022: ఆ మూడు రాశులకు జూలై 2 తరువాత మారనున్న అదృష్టం, డబ్బే డబ్బు

July Horoscope 2022: ప్రతి నెలా గ్రహాలు, నక్షత్రాల స్థానచలనం అన్ని రాశులవారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అదే విధంగా జూలై నెలలో కూడా కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుందట.

జూలై నెల సమీపిస్తోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూలై నెల కొన్ని రాశుల జాతకాలపై మంచి ప్రభావం చూపించనుంది. జూలై నెలలో పలు రాశులవారికి ధనలాభముంటుంది. దాంతోపాటు వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధి కన్పిస్తుంది. జూలై నెలలో కొన్ని గ్రహాలు రాశులు మారనున్నాయి. దీని ప్రభావం మిగిలిన 12 రాశులపై పడనుంది. జూలై నెలలో ఏయే రాశులకు మంచి జరగనుంది, ఏయే ప్రయోజనాలు కలగనున్నాయో పరిశీలిద్దాం..

జూలై 16న కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించనున్నాడు. అటు బుధుడి స్థాన చలనం కూడా పలు రాశులకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ సందర్భంగా బుధుడు 68 రోజులవరకూ మిధునరాశిలో ఉంటాడు. అటు శుక్రుడు జూలై 13న మిధునరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ నేపధ్యంలో జూలై నెల కొన్ని రాశులవారి జాతకాన్ని గణనీయంగా మార్చనుంది. ఆ మార్పులేంటో పరిశీలిద్దాం..

మిధునరాశి జాతకులకు జూలై నెల శుభసూచకంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో సూర్యుడి ఈ రాశిలో ప్రవేశించనున్నాడు. జూలై 2వ తేదీన బుధుడు ఈ రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ నేపధ్యంలో మిధునరాశివారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మిధునరాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అదే సమయంలో జూలై 13వ తేదీన శుక్రుడు కూడా ఇదే రాశిలో ప్రవేశించనుండటంతో..జూలై నెల మిధునరాశివారికి అత్యంత లాభదాయకం కానుంది. వ్యాపారంలో అంతులేని సాఫల్యత లభిస్తుంది. 

కర్కాటక రాశి జాతకులకు జూలై నెల శుభప్రదంగా ఉంటుంది. జూలై 16వ తేదీ నుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనుండటంతో..కర్కాటక రాశివారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. దాంతోపాటు ధనవంతుడైన కుబేరుడి కటాక్షం కూడా లభిస్తుంది. ప్రారంభించిన పనిలో విజయం ఉంటుంది. నెల చివరిలో అంటే జూలై 28న గురుడు కర్కాటక రాశిలో వక్రమార్గం కావడం వల్ల కూడా శుభప్రదంగా ఉంటుంది. 

ధనస్సు రాశివారికి జూలై నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జూలైలో చాలా గ్రహాలు స్థానచలనంతో ధనస్సురాశిలో ప్రవేశించనున్నాడు. జూలై 16 నుంచి సూర్యుడు ఈ రాశి అష్టమభాగంలో ఉండటం వల్ల అంతులేని ధనలాభముంటుంది. బుధుడి ప్రభావం కూడా ఈ రాశిపై స్పష్టంగా కన్పిస్తుంది.

Also read: Wednesday Horoscope: రేపు బుధవారం జూన్ 22న ఏయే రాశులపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News