Gajakesari Yoga: మీన రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారికి ఊహించని ధనలాభం..

Gajakesari Yoga: మీన రాశిలో బృహస్పతి, చంద్రుల కలయిక వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 03:48 PM IST
Gajakesari Yoga: మీన రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారికి ఊహించని ధనలాభం..

Guru Chandra yuti 2023: ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం గురుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇవాళ చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఈరెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. గజకేసరి యోగం వల్ల మూడు రాశులవారు కెరీర్ లో పురోగతితోపాటు అపారమైన సంపదను పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

గజకేసరి రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
కర్కాటక రాశి (Cancer): ఈరాశి వారికి గజకేసరి రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడుతోంది. దీని కారణంగా మీ అదృష్టం ప్రకాశిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పాలిటిక్స్ లో ఉన్నవారికి మంచి పదవికి దక్కుతుంది. 
వృషభ రాశి (Taurus): గజకేసరి రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి యెుక్క కర్మ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. బిజినెస్ చేసే వారు మంచి లాభాలను గడిస్తారు. మీ లైఫ్ పార్టనర్ నుండి సపోర్టు లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
కన్య రాశి (Virgo): గజకేసరి రాజయోగం కన్యారాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో సంతోషం ఏర్పడుతుంది. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 

Also Read: Shani Gochar 2023: ఈ నెల చివరిలో ఈ రాశులను శనిదేవుడు ఇబ్బంది పెడతాడు... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News