Guru Vakri 2023 effect: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. శుభ గ్రహాల్లో ఒకటిగా బృహస్పతిని భావిస్తారు. ధనస్సు మరియు మీనరాశులను పాలించే గ్రహంగా దీనిని పేర్కొంటారు. జ్ఞానం, తెలివితేటలు, సంతానం మరియు ఆధ్యాత్మికతకు కారకుడిగా గురుడిని భావిస్తారు. ఈ నెల ప్రారంభంలో గురుడు మేషరాశిలో తిరోగమనం చేశాడు. బృహస్పతి రివర్స్ లో కదులుతున్న సమయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డిసెంబరు 31 వరకు వీరికి సమయం అస్సలు కలిసిరాదు. మేషరాశి వారు ఏ కార్యం తలపెట్టినా అది సక్సెస్ అవ్వదు. మీరు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు డబ్బు సమస్యలను ఎదుర్కోంటారు. ఈ సంవత్సరం చివరి రోజున బృహస్పతి మేషరాశిలో ప్రత్యక్ష సంచారం చేస్తాడు. అప్పటి వరకు మేషరాశి వారు చాలా కేర్ పుల్ గా ఉండాల్సి ఉంటుంది.
మేషరాశిపై గురువక్రీ ప్రభావం
ఆస్ట్రాలజీ ప్రకారం, మేషరాశి అధిపతి అంగారకుడు. పైగా కుజుడు, గురుడు మిత్రులు. మేషరాశిలో బృహస్పతి తిరోగమనం కారణంగా వీరు మంచి ప్రయోజనాలు పొందాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో మేషరాశిలో గురు-రాహువు కలయిక వల్ల చండాలయోగం ఏర్పడుతుంది. ఇది మేషరాశివారికి చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసిరాకపోవచ్చు. తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు. మీకు డబ్బు నష్టం వాటిల్లుతుంది. తిరోగమన బృహస్పతి అశుభ ప్రభావాలను నివారించడానికి ప్రతిరోజూ మీ తండ్రి మరియు గురువులను పూజించడం లేదా వారి పాదాలను తాకడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది.
Also Read: Saturn direct Movement: ఈ 4 రాశులకు నవంబరు నుంచి మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook