Kajari Teej 2022 Date: పంచాంగం ప్రకారం, శ్రావణం ముగిసి భాద్రపదం ప్రారంభమైంది. భాద్రపద మాసంలోని ప్రతిపద తిథి ఆగస్టు 12వ తేదీ ఉదయం 7.05 గంటల నుండి ప్రారంభమైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది ఆరో నెల. భాద్రపద మాసంలో స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతాల్లో కజరీ తీజ్ ఒకటి.
కజారీ తీజ్ వ్రతం తేదీ
పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం మూడో రోజున కజారీ తీజ్ వ్రతం (Kajari Teej 2022) జరుపుకుంటారు. ఈసారి ఈ కజారీ తీజ్ వ్రతం రేపు అంటే ఆగస్టు 14 ఆదివారం నాడు జరుపుకోనున్నారు. ఈ రోజున పెళ్లైన మహిళలు తమ భర్తల దీర్ఘాయష్షు కోసం పూజలు చేస్తారు. పెళ్లికాని అమ్మాయిలు కోరుకున్న వ్యక్తి తమ భర్తగా రావాలని ఈ ఉపవాసాన్ని చేస్తారు.
శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని తృతీయ తిథి 14 ఆగస్ట్ 12.53కు ప్రారంభమై.. అదే రోజు రాత్రి 10.35 గంటలకు ముగుస్తుంది. ఈ రోజునే కజారీ తీజ్ వ్రతం జరుపుకుంటారు.
అభిజిత్ ముహూర్తం: 14 ఆగస్టు 2022 మధ్యాహ్నం 12:08 నుండి 12:59 వరకు
సర్వార్థ సిద్ధి యోగం: 14 ఆగస్టు 2022 రాత్రి 09:56 నుండి 15 ఆగస్టు 06:09 వరకు
విజయ్ ముహూర్తం : 14 ఆగస్టు 2022 మధ్యాహ్నం 02:41 నుండి 03:33 వరకు
పూజ సామగ్రి
పసుపు బట్టలు, పచ్చి పత్తి, కొత్త బట్టలు, అరటి ఆకులు, కలశం, అక్షింతలు, ఆవు పాలు, గంగాజలం, పంచామృతం, పెరుగు, చక్కెర మిఠాయి, తేనె, తమలపాకు, దుర్వ గడ్డి, నెయ్యి, కర్పూరం, బిల్వ పత్రాలు, డాతురా, చందనం.
Also Read: Mangal Gochar 2022: ఈ 4 రాశుల వారు రాబోయే 3 నెలలుపాటు జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook