Sravana Masam Remedies: ఆషాఢ మాసం ముగిసిన వెంటనే వచ్చేది శ్రావణ మాసం. ఇది 14 జూలై 2022 నుండి ప్రారంభమై.. 12 ఆగస్టు 2022 వరకు కొనసాగుతుంది. ఈ సారి శ్రావణ మాసంలో (Sravana Masam) 5 సోమవారాలు రావడం విశేషం. అదేవిధంగా శ్రావణ మాసానికి ముందు దేవశయని ఏకాదశి (10 జూలై 2022) వస్తుంది. ఆ రోజు నుండే చాతుర్మాసం మెుదలవుతుంది. ఇది నాలుగు నెలలపాటు ఉంటుంది. ఈ సమయంలో శ్రీహరి యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడు సృష్టి సంరక్షణ బాధ్యతలు శివుడు తీసుకుంటాడు. ఈ సమయంలో శుభకార్యాలు నిషిద్దం. శ్రావణ మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే కొన్ని పరిహారాలు చేయాలి.
** మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు తూర్పుదిక్కుకు ఎదురుగా శంఖం, 7 గవ్వలు, పప్పును ఏదో ఒక మూలన ఉంచండి. అనంతరం కొంతసేపు 'ఓం గణపతయే నమః' అనే మంత్రాన్ని జపించండి. సంపద ఉన్న చోట ఆ గవ్వలను, శంఖాన్ని ఉంచండి. పప్పును దానం చేయండి. కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
** మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే.. శ్రావణ మాసంలో మీ చేతులతో మట్టి శివలింగాన్ని తయారు చేయండి. సోమవారం నాడు శివలింగానికి కుంకుమ-పసుపు కలిపిన పాలతో అభిషేకం చేయండి.
** జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోవాలంటే శ్రావణ మాసంలో ప్రతిరోజూ 21 బిల్వ పత్రాలపై తెల్లచందనంతో 'ఓం నమః శివాయ' అని రాసి నైవేద్యాన్ని సమర్పించండి. అన్ని కష్టాలు దూరమై.. మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
Also Read: Sun Transit July 2022: జూలై 16 నుంచి ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook