Karwa Chauth 2023 Time: హిందూ సాంప్రదాయంలో కర్వా చౌత్ పండగకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ పండగ రోజు వివాహిత స్త్రీలు ఉపవాసాలు పాటించడం ఆనవాయితిగా వస్తోంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి రోజున కర్వా చౌత్ పండగ వచ్చింది. ఈ రోజు మహిళలు రోజంతా నిర్జల వ్రతం పాటించి, చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా భర్త దీర్ఘాయువు కోసం శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ రోజు పంగడ రావడంతో అనేక శుభ యాదృచ్ఛికాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా ఈ రోజు ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కర్వా చౌత్ శుభ సమయం, పూజా విధానం, చంద్రుడి దర్శన సమయానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కర్వా చౌత్ శుభ సమయం:
కర్వా చౌత్ ఉపవాసాలు పాటించేవారు తప్పకుండా శుభ సమయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చతుర్థి అక్టోబర్ 31న రాత్రి 09.31 గంటలకు ప్రారంభమై..నవంబర్ 1వ తేదీ రాత్రి 09.20 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నవంబర్ 1వ తేదినా ఉదయ తిథి రోజున కర్వా చౌత్ ఉపవాసం పాటించడం శుభప్రదంగా నిపుణులు పేర్కొన్నారు.
శుభ యోగాలు:
ఈ సంవత్సరం కర్వా చౌత్ పండగ ప్రత్యేక సమయాల్లో రావడం వల్ల అనేక రకాల శుభ యోగాలు ఏర్పడ్డాయని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శివయోగం, సర్వార్థ సిద్ధి యోగాలతో కూడిన శుభ యోగాలు ఏర్పడ్డాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
కర్వా చౌత్ పూజా సమయం:
ఈ రోజున ఉదయం 07:55 నుంచి 09:18 వరకు పూజకు అనుకూలమైన సమయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఉదయం 10.41 గంటల నుంచి మధ్యాహ్నం 12.04 గంటల వరకు పూజకు శుభప్రదమైన సమయంగా నిపుణులు చెబుతున్నారు.
కర్వా చౌత్‌లో చంద్రోదయ సమయం:
కర్వా చౌత్ పండగలో భాగంగా చంద్రుడిని చూడటం ఆనవాయితిగా వస్తోంది. అయితే కొన్ని సార్లు చంద్రుడి దర్శనం కోసం గంటల తరబడి వేచి చేస్తూ ఉంటారు. ఈ సారి వాతావరణం స్పష్టంగా ఉండడం కారణంగా రాత్రి 08:15 గంటలకు చంద్రుడు స్పష్టంగా కనిపిస్తాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ చంద్రోదయం ప్రాంతాలను బట్టి మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook