Goddess Lakshmi Blessings: లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే.. సాయంత్రం వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయొద్దు..

Avoid these things to get Goddess Lakshmi Blessings: హిందూ గ్రంథాల ప్రకారం... లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించడం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 10:12 PM IST
  • లక్ష్మీ దేవి అనుగ్రహం పొందేందుకు టిప్స్
  • సాయంత్రం వేళల్లో ఈ పనులు అసలు చేయకూడదు
  • ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Goddess Lakshmi Blessings: లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే.. సాయంత్రం వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయొద్దు..

Avoid these things to get Goddess Lakshmi Blessings: హిందూ గ్రంథాల ప్రకారం... లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించడం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు.
తద్వారా సుఖ, సంతోషాలు, శాంతి కలుగుతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే సాయంత్రం వేళల్లో కొన్ని పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తలుపులు మూసివేయకూడదు:

సాయంత్రం, ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఇంటి తలుపు తెరిచి ఉంచాలి. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూసి ఉంచవద్దు. సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. కాబట్టి సూర్యాస్తమయం సమయంలో ఇంటి తలుపు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి ఐశ్వర్యం కలగజేస్తుంది.

సూది, వెల్లుల్లి-ఉల్లిపాయలు ఇవ్వకూడదు:

సాయంత్రం వేళల్లో ఎవరికీ సూది, వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవ్వకూడదు. వేరొకరి నుండి సాయంత్రం పూట వెల్లుల్లి-ఉల్లిపాయలు లేదా సూదులు తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ స్థిరపడుతుంది. ఈ వస్తువులను ఇవ్వడం లేదా సాయంత్రం ఇంటికి తీసుకురావడం రెండూ అరిష్టమని కూడా నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంటి సభ్యుల మధ్య అనవసర గొడవలు జరగవచ్చు.

తులసిని తాకవద్దు:

సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం, సాయంత్రం పూట తులసిని తాకకూడదు. తులసిని రాధా రాణి రూపంగా భావిస్తారు. సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని తాకకుండా ఉండాలి. అలాగే తులసి మొక్క వద్ద దీపం వెలిగించాలి.

సూర్యాస్తమయం సమయంలో ఆర్థిక లావాదేవీలు జరపవద్దు :

శాస్త్రీయ విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఆర్థిక లావాదేవీలు జరపకూడదు. సూర్యాస్తమయ సమయంలో ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఉదయాన్నే పెట్టుకోవడం అన్నివిధాలా శుభప్రదం.

Also Read: AP govt on Pegasus spyware: భూమన కరుణాకర్‌ రెడ్డి చైర్మెన్‌గా పెగాసస్ హౌజ్ కమిటి

Also read : CI Kambagiri Ramudu: ఇదెక్కడి చోద్యం..? పోలీసును పట్టుకోటానికి పోలీసు బృందం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News