Krishna Janmashtami 2023: హిందువులంతా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ట పక్షంలోని 8వ రోజున శ్రీ కృష్ణుడి జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. దీనినే భారతీయులు జన్మాష్టమి పండుగ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఈ పండను ఎంతో ఘనంగా రెండు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ జన్మాష్టమి సాధరణ ప్రజలు ఒక రోజు జరుపుకుంటే మాత్రం వైష్ణవ ఆచారాలు పాటించేవారు రెండు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం సెప్టెంబరు 6, 7 తేదీల్లో శ్రీకృష్ణుని జయంతి జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
గ్రంథాల ప్రకారం..శ్రీ కృష్ణుడు కృష్ట పక్షంలోని రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి 12 గంటలకు జన్మించాడు. అంతేకాకుండా ఇదే రోజు శ్రీమహావిష్ణువు కృష్ణునుడిగా ఎనిమిదవ అవతారం ఎత్తి.. కంసుని దుష్ప్రభావాల నుంచి ప్రజలను విడిపించాడు. ఇంతటి మంచి రోజున కొన్ని రాశులవారికి శ్రీ కృష్ణుడి అనుగ్రహం లభించబోతోంది. ఈ రోజు కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందబోతున్నారు. అయితే జన్మాష్టమి పండుగ రోజు ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు లాభాలు పొందబోయే రాశులవారు వీరే:
వృషభ రాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..అన్ని రాశులకెళ్ల శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన రాశి వృషభ రాశి.. సెప్టెంబరు 6, 7 తేదీల్లో ఈ రాశివారికి శ్రీ కృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా శ్రీ కృష్ణుడి అనుగ్రహంతో వ్యాపారాలు ప్రారంభిస్తే ఊహించని లాభాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారు ప్రతిరోజూ శ్రీకృష్ణుడిని పూజిస్తే జీవితంలో పొందలేని ఆనదాన్ని తప్పకుండా పొందుతారు. అంతేకాకుండా వృత్తి, వ్యాపార జీవితంలో ఊహించని లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కష్టపడి పనులు చేసేవారికి కృష్ణుడి అనుగ్రహం లభించి ఉన్న శిఖరాలకు చేరుకుంటారు.
సింహ రాశి:
శ్రీకృష్ణునికి ఇష్టమైన రాశుల్లో సింహ రాశి కూడా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా కష్టపడి పనులు చేస్తారు. కాబట్టి శ్రీ కృష్ణుడి అనుగ్రహం ఎప్పటికి లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో కూడా ఎలాంటి లోటు ఉండకుండా చూస్తాడు. ఆర్థికంగా కొత్త దారులను ఎల్లప్పుడు చూసిస్తాడు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి