Lunar Eclipse 2020: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా..?

ఈ ఏడాది చివ‌రి చంద్ర‌గ్ర‌హ‌ణం (lunar eclipse 2020) ఈ నెల 30న ఏర్పడనుంది. కార్తీక పౌర్ణ‌మి నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడునుందని నిపుణులు తెలిపారు. అయితే ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అంటారు.

Last Updated : Nov 22, 2020, 02:36 PM IST
Lunar Eclipse 2020: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా..?

Last lunar eclipse of 2020 on November 30: న్యూఢిల్లీ: ఈ ఏడాది చివ‌రి చంద్ర‌గ్ర‌హ‌ణం (lunar eclipse 2020) ఈ నెల 30న ఏర్పడనుంది. కార్తీక పౌర్ణ‌మి నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడునుందని నిపుణులు తెలిపారు. అయితే ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అంటారు. ఈ చంద్ర గ్రహణం కంటికి కనిపించదు. అందుకే దీనిని ఉపఛాయ చంద్రగ్రహణం (Upachhaya eclipse) అని అంటారు. ఈ ఉపఛాయ చంద్రగ్రహణం  మధ్యాహ్నం సమయంలో ఏర్పడనుంది. నవంబ‌ర్ 30న సోమవారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మై సాయంత్రం ముగియనుంది. 
ఉపఛాయ చంద్రగ్రహణం ప్రారంభ సమయం:
ప్రారంభ సమయం: మధ్యాహ్నం 1:04 గంటలకు. 
గ్రహణం మధ్య దశ: మధ్యాహ్నం 3.13 గంటలకు.
గ్రహణం ముగింపు దశ:  సాయంత్రం 5:22 గంటలకు.

'ఉపచయ' గ్రహణం - ప్రభావం..
హిందూ మ‌తంలో దీనికి ఎలాంటి ప్రాధాన్య‌త ఉండ‌దు. హిందూ పురాణాల ప్రకారం ఉపఛాయ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించినప్పటికీ అంత ప్రభావం ఉండదు. ఉపఛాయ చంద్రగ్రహణం రోజు చంద్రుడి నీడ భూమికి అవతలి భాగంలో ఏర్పడుతుంది. అంటే ఉపఛాయ ప్రాంతంలో ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు సూర్యుడి కిరణాలను చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. ఫలితంగా భూమికి అవతలి భాగంలో చంద్రుడు కనిపించడు. అయితే ఈ చంద్ర‌గ్ర‌హ‌ణం భారతదేశంతోపాటు ఆస్ట్రేలియా, అమెరికా, ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం, ఆసియా ప్రాంతాల్లో క‌నిపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. Also read: 
Lunar eclipse: చంద్ర గ్రహణం ఆరోగ్యం, రాశీఫలాలపై ప్రభావం చూపిస్తుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News