Leo Horoscope New Year 2024: 2024లో సింహ రాశివారికి 99 శాతం జరబోతోంది ఇదే..

Leo Horoscope New Year 2024 Telugu: 2024 సంవత్సరం సింహ రాశివారికి సాధరణంగా ఉంటుదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 12:12 PM IST
Leo Horoscope New Year 2024: 2024లో సింహ రాశివారికి 99 శాతం జరబోతోంది ఇదే..

 

Leo Horoscope New Year 2024 Telugu: 2024 కొత్త సంవత్సరంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా గ్రహాల స్థితులు కూడా మారుతాయి. ముఖ్యంగా బుధుడు, శుక్రుడు వృశ్చికరాశిలో ఉండబోతున్నాయి. చంద్రుడు వ్యయానికి సంబంధించి 12వ స్థానంలో ఉండబోతున్నాడు. ఇక గురు గ్రహం 8వ స్థానంలో మేషరాశిలో సంచార దిశలో ఉండబోతోంది. అలాగే శని గ్రహం కుంభ రాశిలో ఆరవ స్థానంలో ఉండబోతున్నాడు. ఇదే సమయంలో కేతువు లగ్న గృహంలో ఉండడం కారణంగా ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌లు ఉంది. ముఖ్యంగా సింహ రాశి వారి 2024  సంవత్సరం ఫలాల విషయానికొస్తే..సంపద, ఆదాయం, కుటుంబ వృద్ధి కోణం సానుకూలంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన పనుల్లో పురోగతి లభించడమే కాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

ముఖ్యంగా ఈ సంవత్సరం సింహ రాశివారికి వ్యాపారాలు చేసే వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు తెలివితేటలు, ధైర్యంతో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. విదేశీ కంపెనీలలో చేరడమే కాకుండా ఊహించని లాభాలు పొందుతారు. ఇక ఆర్థిక కార్యకలాపాల విషయానికొస్తే ఈ 2024 సంవత్సరం చాలా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంల్లో వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా చాలా లాభాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో కొత్త శుభ కార్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి కెరీర్ ఫలాలు:
ఉద్యోగం, వ్యాపారం, ధైర్యం చూస్తే ఈ సింహ రాశివారికి 2024 సంవత్సరం సాధారణంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి వంటి సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయి. సన్నిహిత వ్యక్తులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మనసులో ఏదో తెలియని భయం పెరుగుతుంది.  ఉద్యోగంలో మార్పులు కూడా రావచ్చు. చదువు, డిగ్రీ, పిల్లల కోణంలో చూస్తే చదువు సాధారణ స్థాయిలోనే ఉండవచ్చు. పిల్లల విషయంలో కొంత ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం పట్ల తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక పురోగతికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

సింహ రాశి లవ్‌లైఫ్:
ఈ సంవత్సరం సింహ రాశి వారికి వైవాహిక జీవితంలో ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తత, అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక పరిస్థితుల్లో కూడా అనేక రకాల సమస్యలు తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా ఈ సమయంలో భూమి, ఆస్తి తగాదాలు, గృహ, వాహన సౌకర్యాల విషయంలో ఉద్రిక్తతలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.  నరాలు, శ్వాస సమస్యలు, BP సమస్యలతో బాధపడేవారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  కాబట్టి ఈ సమయంలో గురు దేవుడిని పూజించడం చాలా మంచిది.

పరిహారాలు:
సింహరాశివారికి ఈ సంవత్సరంలో  రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లో  విస్తృతమైన మార్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రాహు, సూర్య, అంగారకుడిని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జాతక ప్రకారం అశుభ స్థానంలో గ్రహాలు ఉంటే తప్పకుండా పలు పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News