February Horoscope 2023: ఫిబ్రవరిలోFebruary Horoscope 2023: ఫిబ్రవరిలో రాశి మారనున్న సూర్యుడు, బుధుడు, శుక్రుడు.. ఈ రాశుల వారిపై డబ్బు వర్షం ఈ రాశుల వారిపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

February Monthly Horoscope 2023: ఫిబ్రవరి నెలలో కొన్ని రాశులవారు పట్టిందల్లా బంగారం కానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 08:43 AM IST
February Horoscope 2023: ఫిబ్రవరిలోFebruary Horoscope 2023: ఫిబ్రవరిలో రాశి మారనున్న సూర్యుడు, బుధుడు, శుక్రుడు..  ఈ రాశుల వారిపై డబ్బు వర్షం ఈ రాశుల వారిపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

February Horoscope 2023: ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరిగాయి. ఫిబ్రవరిలో కొన్ని గ్రహాల స్థానంలో పెను మార్పులు రానున్నాయి. ఈనెలలో సూర్యభగవానుడు, బుధుడు, శుక్రుడు వంటి గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. ఈ ఫ్లానెట్స్ సంచారం వల్ల కొన్ని రాశులవారు ఎంతో ప్రయోజనం పొందుతారు. వీరు కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఫిబ్రవరి నెల ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

ఫిబ్రవరి నెలవారీ రాశిఫలం 2023

మేషం (Aries): మేష రాశి వారికి ఫిబ్రవరిలో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. మీ పనుల్లో విజయం వరిస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వివాహం కానీవారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. 

వృషభం (Taurus): వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయంలో భారీగా పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు డబ్బును ఆదా చేస్తారు. 

కుంభం (Aquarius): ఫిబ్రవరి నెల కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు మీ పనులకు మంచి ఫలితాలు పొందుతారు. వృత్తిలో లాభాలుంటాయి. ఉద్యోగం చేసే వారు పురోగతిని పొందవచ్చు. వ్యాపారుల వ్యాపారం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. 

ధనుస్సు (Sagittarius): ఫిబ్రవరి నెల ధనుస్సు రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు చాలా డబ్బును గడిస్తారు. షేర్ మార్కెట్‌లో లాభాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. . ప్రేమ, వైవాహిక జీవితం రెండూ బాగుంటాయి. 

Also Read: Jupiter Rise 2023: బృహస్పతి ఉదయం 2023.. ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు! నోట్ల వర్షం కురుస్తుంది 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News