Lunar Eclipse 2021 Date, Timings: చంద్రగ్రహణం టైమింగ్స్, భారత్‌లో ఎక్కడెక్కడ వీక్షించవచ్చు

Lunar Eclipse 2021 Date And Timings: చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ స్థితిని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. చంద్రుడు పూర్తిగా కనిపిస్తే సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షికంగా కనిపిస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 

Written by - Shankar Dukanam | Last Updated : May 26, 2021, 01:25 PM IST
Lunar Eclipse 2021 Date, Timings: చంద్రగ్రహణం టైమింగ్స్, భారత్‌లో ఎక్కడెక్కడ వీక్షించవచ్చు

Super Blood Moon | ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలున్నాయి. 2021లో మొదటగా ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. మే 26న మొత్తం 5 గంటల 2 నిమిషాలపాటు గ్రహణ సమయం. చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ స్థితిని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. చంద్రుడు పూర్తిగా కనిపిస్తే సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షికంగా కనిపిస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 

నేటి మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్‌లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. పాక్షిక చంద్రగ్రహణ దశ నేటి ( మే 26) సాయంత్రం 6:23 నిమిసాలకు పూర్తవుతుంది. అయితే సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse 2021) మధ్యాహ్నం 4:39 గంటల ప్రాంతంలో మొదలై కేవలం 19 నిమిషాలకు అంటే 4:58 గంటలకు ముగుస్తుంది. తదుపరి చంద్రగ్రహణం మరో 6 నెలల తరువాత నవంబర్ నెలలో 19వ తేదీన ఏర్పడుతుంది. జూన్ 10వ తేదీన ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం, డిసెంబర్ 4వ తేదీన రెండో సూర్యగ్రహణం ఏర్పడనున్నాయి. 

Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది

నేడు సూపర్ బ్లడ్ మూన్..
చంద్రగ్రహణం సమయంలో, పూర్ణ చంద్రుడు ప్రయాణిస్తూ భూమి నీడ మార్గంలో వెళతాడు. అయితే ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. కనుక దీనిని బ్లడ్ మూన్ (Blood Moon) అంటారు. అదే విధంగా నేడు చంద్రుడు పెరిజీ స్థానంలో ఉంటాడు. అంటే భూమికి అతిసమీపంలోకి వచ్చి సాధారణం కన్నా 7 శాతం పెద్దదిగా, మరియు 15 శాతం అధిక ప్రకాశవంతంగా కనిపించడంతో సూపర్ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. కొందరు ఈ మే నెల పౌర్ణమిని ఫ్లవర్ మూన్ (Flower Moon) అని పిలుస్తారు. 

చంద్రగ్రహణం ఎక్కడెక్కడ వీక్షించవచ్చు..
పశ్చిమ ఆసియా ప్రాంతంలో, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో పలు ప్రాంతాలు, మెక్సికో, హవాయ్, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఫసిఫిక్ మహా సముద్రం, తదితర ప్రాంతాల వారు సూర్యగ్రహణాన్ని వీక్షిస్తారు. భారత్‌లో అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సూపర్ బ్లడ్ మూన్, చంద్రగ్రహణం కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది. సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రాంతాలవారు చంద్రగ్రహణం విడిచే సమయంలో చంద్రుడిని వీక్షిస్తారు. 

Also Read: Horoscope Today: నేటి రాశి ఫలాలు మే 26, 2021, ఓ రాశివారికి శుభవార్తలు అందుతాయి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News