Chandra Grahan 2023: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది ఇండియాలో కనిపిస్తుందా?

Lunar eclipse 2023: ఈ ఏడాది రెండవ మరియు చివరి చంద్రగ్రహణం అక్టోబరులో ఏర్పడబోతుంది. ఇది భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం. ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి, సూతక్ కాలం చెల్లుబాటు అవుతుందో లేదో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2023, 05:10 PM IST
Chandra Grahan 2023: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది ఇండియాలో కనిపిస్తుందా?

Chandra Grahan 2023 effects in Telugu: ఈ సంవత్సరం ఇప్పటికే సూర్య, చంద్రగ్రహణాలు సంభవించాయి. త్వరలో మరో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. 2023 సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం అక్టోబరు 29, ఆదివారం నాడు ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనుంది. మిగిలిన మూడు గ్రహణాలు ఇండియాలో కనిపించవు. 

ఈ సారి ఏర్పడబోయే చంద్రగ్రహణం అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై 02:22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం యెుక్క మొత్తం వ్యవధి 1 గంట 16 నిమిషాలు. భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి దాని సూతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు నిషేదించడం జరిగింది. ఈ సూతక్ కాలంలో ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయరు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు.

Also Read: Shani Vakri 2023: శష్ రాజయోగంతో మారనున్న ఈ 3 రాశుల ఫ్యూచర్.. మీది ఉందా?

ఖగోళ శాస్త్రం ప్రకారం, సూర్యుడు మరియు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా ప్రజలు గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. రాహు కేతువులు చంద్రుడిని మింగడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడిందని చాలా మంది నమ్ముతారు. ఈ గ్రహణాన్ని చూసేందుకు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: Budhaditya Rajyog: మరో 3 రోజుల్లో ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News