Surya Shani yuti 2023: 30 ఏళ్ల తర్వాత మకరరాశిలో తండ్రీకొడుకుల కలయిక.. ఈ 3రాశులకు తిరుగులేదు ఇక..

Saturn And Surya Conjunction 2023: ఇవాళ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు మకరరాశిలో సంచరించనున్నారు. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 01:25 PM IST
Surya Shani yuti 2023: 30 ఏళ్ల తర్వాత మకరరాశిలో తండ్రీకొడుకుల కలయిక.. ఈ 3రాశులకు తిరుగులేదు ఇక..

Saturn And Surya Conjunction 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తాయి. వీటి ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. జనవరి 14 రాత్రి నాడు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే శనిదేవుడు అదే రాశిలో ఉన్నాడు. మకరరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీని కారణంగా మూడు రాశులవారు అపారమైన ధనాన్ని పొందనున్నారు.  ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శని-సూర్య సంయోగం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం (Aries): సూర్యుడు మరియు శని దేవుల కలయిక శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదో స్థానంలో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీరు కొత్త జాబ్ ఆఫర్‌ను పొందే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారవేత్తలు మంచి లాభాలను గడిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిలిచిపోయిన చెల్లింపులు పూర్తవుతాయి. బిజినెస్ లో పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. 

వృషభ రాశి (Taurus): సూర్యుడు మరియు శనిదేవుడు కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదో ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశించనుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఆధాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 

ధనుస్సు రాశిచక్రం (Sagittarius): సూర్యుడు మరియు శని కలయిక ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశితో సంపద పరంగా ఈ కూటమి ఏర్పడుతోంది. అందుకే ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. వ్యాపారం చేసేవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. మీరు సడే సతి నుండి కూడా విముక్తి పొందుతారు.

Also Read: Sun Transit 2023: సంక్రాంతి నాడే సూర్యభగవానుడి మకరరాశి ప్రవేశం... ఈ రాశులకు ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News