Mangala Dosham: మంగళ దోషమంటే ఏంటి, ఏం జరుగుతుంది, పరిష్కార మార్గాలేంటి

Mangala Dosham: హిందూమతం ప్రకారం.మంగళదోషముంటే చాలా అనర్దాలు తలెత్తుతాయి. సమస్యలు ఉద్భవిస్తాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో. మరి మంగళదోషం నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2022, 10:04 PM IST
Mangala Dosham: మంగళ దోషమంటే ఏంటి, ఏం జరుగుతుంది, పరిష్కార మార్గాలేంటి

Mangala Dosham: హిందూమతం ప్రకారం.మంగళదోషముంటే చాలా అనర్దాలు తలెత్తుతాయి. సమస్యలు ఉద్భవిస్తాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో. మరి మంగళదోషం నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలి..

జ్యోతిష్యశాస్త్రంలో మంగళదోషానికి ప్రాధాన్యత ఉంది. ఏదైనా జాతకంలోని కుండలిలో ప్రధమ, నాలుగవ లేదా ఏడవ స్థానంలో మంగళ గ్రహం ఉంటే మంగళదోషమని అర్ధం. దీనివల్ల ఆ వ్యక్తి వైవాహిక జీవితం, వివాహంలో పలు సమస్యలు తలెత్తుతాయి. అందుకే సుఖమైన వైవాహిక జీవితం కోసం ఆ వ్యక్తి ముందు మంగళ దోషం నుంచి విముక్తుడవ్వాలి. జీవిత భాగస్వామితో మంచిగా ఉన్నా..పెళ్లి పెటాకులవుతుంటుంది. లేదా ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. అంటే కుండలిలో మంగళ దోషం ఉందనే అర్ధం. 

మంగళ దోషమంటే

కుండలిలో ప్రధమ, నాలుగవ లేదా ఏడవ స్థానంలో మంగళ గ్రహం ఉంట మంగళ దోషం ఉందని అర్ధం. జ్యోతిష్యం ఇదే చెబుతోంది. ఈ దోషం కారణంగానే ఆ వ్యక్తి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురౌతాయి. అభిప్రాయబేధాలు, తప్పుడు అభిప్రాయాలు కలుగుతుంటాయి. ఫలితంగా వివాహంలో లేదా వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఎదురౌతాయి.

మంగళ దోషం చాలా ప్రమాదకరంగా భావిస్తారు. ఎందుకంటే నిర్ణీత సమయంలో పరిష్కారమార్గాలు అనుసరించకపోతే..పెళ్లి ఆలస్యం కావడం, అశాంతి, విడాకులు వంటివి ఎదురౌతాయి. మంగళ దోష బాధితుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన, దుఖం, ఇతర సమస్యలు ప్రారంభమౌతాయి. ఒకవేళ వాటిని తగిన సమయంలోగా గుర్తించలేకపోతే జ్యోతిష్యశాస్త్రంలో వివరించిన పరిష్కార మార్గాలతో కూడా ఉపయోగం ఉండదు. అందుకే ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

జ్యోతిష్యశాస్త్రంలో మంగళదోషం నుంచి విముక్తుడయ్యేందుకు మంగళ చండిక పఠించాలి. నిర్ణీత పద్ధతిలో దుర్గామాత విగ్రహం ముందు కుంభ వివాహం, విష్ణు వివాహం, అశ్వయ వివాహం వంటివి చేయాలి. ప్రత మంగళవారం హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతి నెలా శుక్లపక్షంలోని మంగళవారం నాడు మంగళ మంత్రం, కందిపప్పు తినడం ద్వారా మంగళ దోషం దూరం చేయవచ్చు. మంగళ దోషం ప్రభావాన్ని దూరం చేసేందుకు నిర్ణీత పద్దతిలో 108 సార్లు సర్వశక్తివంతమైన గాయత్రి మంతాన్ని జపించాలి. 

Also read: Gemology: అదృష్టం తిరగరాసేందుకు...అంతులేని ధనం కోసం...ఈ 4 రత్నాలు ధరించండి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News