Mohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. క్లారిటీ ఇదిగో..!

Manchu Manoj Complaints Against Mohan Babu: తన భార్యపై, తనపై మోహన్ బాబు దాడి చేశాడని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గాయాలతో స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మంచు ఆఫీస్ టీమ్ చెబుతోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 8, 2024, 12:07 PM IST
Mohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. క్లారిటీ ఇదిగో..!

Manchu Manoj Complaints Against Mohan Babu: మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు మోహన్‌ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని ఇన్నాళ్లు చర్చ జరుగుతున్న విషయం తెలిసిదే. ఇప్పుడు పరస్పరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. గాయాలతో పోలీస్ స్టేషన్‌ వచ్చి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ప్రచారానికి తెర లేపారు. తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ వార్తలపై మోహన్ బాబు , మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదని మంచు ఆఫీసు క్లారిటీ ఇచ్చింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపింది. ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని.. వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది.

మరోవైపు మంచు మనోజ్ జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడుతూ.. గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందని చెప్పారు. తన తండ్రి మోహన్ బాబు తన అనుచరుల చేత దాడి చేయించారని ఆరోపించారు. కచ్చితంగా ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News