జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకం కుండలిలోనైనా ఏదైనా గ్రహం అశుభస్థితిలో ఉంటే..చాలా రకాల సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయం వరకూ ఏ రాశివారికైనా అశుభం కానుంది. మంగళ మహాదశ ఏడేళ్ల వరకూ నడుస్తుంది.
మంగళ మహాదశ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఏడేళ్ల వరకూ అష్టకష్టాలు తప్పవు. వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. జ్యోతిష్యం ప్రకారం మంగళ మహాదశ సందర్భంగా ఆ వ్యక్తి భూమి, సంపద విషయంలో నష్టాన్ని చవిచూడవచ్చు. బంధాల్లో పెద్దన్నయ్యతో జెలసీ, మోసం, వివాదం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. మంగళ మహాదశ ఎలా ఉంటుంది. దాన్నించి తప్పించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
కుండలిలో మంగళ గ్రహం అశుభంగా ఉంటే
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒకవేళ కుండలిలో మంఘల గ్రహం అశుభంగా ఉంటే ఆ వ్యక్తికి ముందు నుంచే సంకేతాలు లభిస్తాయి. ఆ సంకేతాల్ని సకాలంలో గుర్తించగలగాలి. మంగళ గ్రహం అశుభంగా ఉంటే వ్యక్తికి కంటి రోగం సమస్య రావచ్చు. అటు ఆ వ్యక్తికి అధిక రక్తపోటు, రాళ్లు వంటి సమస్యలు వేధిస్తాయి. అంతేకాకుండా ఎక్కువగా కోపం రావడం, గర్వం, మాంసం తినడం, మద్యం తాగడం, బంధువులను మోసం చేయడం వంటి సమస్యలు రావచ్చు. ఈ పరిస్థితుల్లో మంగళ గ్రహాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని ఉపాయాలు పాటించాల్సి ఉంటుంది.
మంగళ గ్రహాన్ని పటిష్టం చేసేందుకు ఏం చేయాలి
మంగళవారం నాడు స్నానం చేసిన తరువాత ఎర్రరంగు బట్టలు ధరించాలి. ఆ తరువాత ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమహ మంత్రాన్ని3,5,7 సార్లు జపించాలి. మంగళవారం నాడు వ్రతం ఆచరిస్తే మంగళ గ్రహం పటిష్టమౌతుందంటారు. మంగళ గ్రహానికి సంబంధం మంగళ దేవుడు, మంగళవారంతో ముడిపడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం నాడు హనుమంతుడికి సింధూరం అర్పించడం వల్ల శుభం జరుగుతుంది. ఈ రోజు సింధూరంలో కొద్దిగా సంపెంగ నూనె కలపడం ద్వారా మంగళ గ్రహం పటిష్టమౌతుంది.
అంతేకాకుండా..ఆ రోజు మంగళ గ్రహాన్ని పటిష్టం చేసేందుకు హనుమంతుడికి చోళ అర్పించాలి. రత్నశాస్త్రం ప్రకారం మంగళ గ్రహాన్ని పటిష్టం చేసేందుకు జ్యోతిష్య పండితులు సూచించిన రత్నాన్ని ధరించాలి. మంగళ గ్రహాన్ని పటిష్టం చేసేందుకు ఎర్ర బట్టలు, రాగి, గోధుమలు, బెల్లం వంటివి దానం చేయాలి.
Also read: Tarot Cards: ట్యారో కార్డ్స్ ప్రకారం ఆ 5 రాశులకు ఇవాళ ఏం జరగనుంది, ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook