Holi 2023: హోలీ నాడు ఈ 4 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా?

Holi 2023:  మార్చి మెుదటి వారంలో శనిదేవుడు ఉదయించబోతున్నాడు. అంతేకాకుండా హోలీ పండుగ కూడా వస్తుంది. ఈ రెండు సంఘటనల కారణంగా కొన్ని రాశులవారిని అదృష్టం వరించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 01:41 PM IST
Holi 2023:  హోలీ నాడు ఈ 4 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా?

Holi 2023:  రంగుల హోలీ వచ్చే నెలలో రాబోతుంది. మార్చి 7న ఫాల్గుణ పూర్ణిమ రోజున హోలికా దహనం జరుపుకోనుండగా.. మార్చి 8న హోలీ ఆడతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈపండుగను జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇవ్వనుంది. ఎందుకంటే హోలికా దహనానికి ఒక రోజు ముందు అంటే మార్చి 6, 2023న శని గ్రహం కుంభరాశిలో ఉదయించబోతుంది. హోలీ ముందు శని రైజింగ్ వల్ల కొన్ని రాశులవారు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభాలను గడించనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కుంభం- హోలీ ముందు శనిదేవుడు ఉదయం కుంభరాశివారికి కలిసి వస్తుంది. వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇది పెట్టుబడికి అనుకూలమైన సమయం. మీరు ఆర్థికంగా బలపడతారు. ఈ సమయంలో మీరు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఎవరినీ అతిగా నమ్మెద్దు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది 
తులారాశి - హోలీ పండుగ తులారాశి వారికి ఎంతో మేలు చేయబోతోంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. శనిదేవుడిని పూజించడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. 
వృషభం - శనిదేవుడు హోలీ రోజున మీకు అనేక ప్రయోజనాలను ఇవ్వనున్నాడు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు శనిదేవుని అనుగ్రహంతో పూర్తవుతాయి. మీ కెరీర్ లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
సింహ రాశి - సింహ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. జీతంలో బంపర్ పెరుగుదల ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ధనం అందుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ పనికి ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. డబ్బును ఆదా చేస్తారు. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. 

Also Read: Surya Guru Yuti 2023: పుష్కర కాలం తర్వాత గురు-సూర్య కలయిక.. ఈరాశులపై డబ్బు వర్షమే ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News