Mars Transit 2022: ఆ మూడు రాశులవారికి నవంబర్ 13 నుంచి తస్మాత్ జాగ్రత్త

Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం ఉంటుంది. ఆ ప్రభావం 12 రాశులపై కచ్చితంగా పడుతుంది. నవంబర్ 13న మంగళ గ్రహం వక్రమార్గం పట్టనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2022, 04:38 PM IST
Mars Transit 2022: ఆ మూడు రాశులవారికి నవంబర్ 13 నుంచి తస్మాత్ జాగ్రత్త

ప్రతి గ్రహం రాశి పరివర్తనం చేస్తుంటుంది. ఈ ప్రభావం నిర్ణీత రాశితో పాటు అన్ని రాశుల జాతకాలపై పడుతుంటుంది. నవంబర్ 13వ తేదీన మంగళ గ్రహం రాశి పరివర్తనం ప్రభావం తెలుసుకుందాం..

గ్రహాలు, రాశుల పరివర్తనానికి జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. రాశుల జాతకాలపై శుభ, అశుభ ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులపై అమిత ప్రభావం ఉంటుంది. నవంబర్ 13వ తేదీన మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశిస్తుంది. అన్ని రాశులపై ఈ ప్రభవం పడనుంది. కొన్ని రాశుల జాతకాల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రాశుల జీవితంలో ధననష్టం కలగనుంది. 

మేషరాశిపై మంగళగ్రహం వృషభరాశి ప్రవేశం కారణంగా అశుభ ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా మేషరాశి జాతకులకు ధననష్టం విపరీతంగా ఉంటుందని తెలుస్తోంది. పనిచేసే చోట ఇతరులతో బంధాలు చెడవచ్చు. ఆర్ధికంగా నష్టాలు ఎదురౌతాయి. ఈ రాశి జాతకులు లావాదేవీలు, పెట్టుబడులకు దూరంగా ఉండాలి.

మిధునరాశి జాతకులకు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సమయం హాని కల్గిస్తుంది. ఈ రాశిలోని 12వ స్థానంలో మంగళ గోచారం ఉండటం వల్ల హాని కారకంగా, ధననష్టంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. సోదర సోదరీమణుల మధ్య సంబంధాలు చెడిపోతాయి. ప్రయాణం సందర్భంగా ఆర్ధిక నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కూడా వివాదం ఏర్పడవచ్చు.

తులారాశిపై ఈ సమయం చాలా కష్టంగా గడుస్తుంది. మంగళగ్రహం 8వ భాగంలో గోచారం కారణంగా తెలియని రోగాలు సంభవిస్తాయి. తులరాశి జాతకులకు విజయం లభించాలంటే తీవ్రమైన కష్టం ఎదుర్కోవల్సి వస్తుంది. మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. ఏమైనా దుర్ఘటన ఎదురుకావచ్చు. అందుకే చాలావరకూ అప్రమత్తంగా ఉండాలి. పనిచేసే చోట నిర్లక్ష్యం మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. 

Also read: Mahapurush Rajyog: శనిదేవుడి 'మహాపురుష రాజయోగం'.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం ఖాయం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News