Mangal Gochar 2022: అంతరిక్షంలో గ్రహాల స్థానం మార్పు అనేది కామన్. ప్రతి నెల కొన్ని గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ప్లానిట్స్ మార్పు ప్రభావం ప్రజలందరి జీవితాలపై కనిపిస్తుంది. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందితే, మరికొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఆస్ట్రాలజీ ప్రకారం, అక్టోబరు 30న కుజుడు మిథునరాశిలోకి (Mars Transit in Gemini 2022) ప్రవేశిస్తున్నాడు. దీని సంచార ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
మేషరాశి (Aries): మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సమయంలో మీరు ఎటువంటి వివాదాలు జోలికి పోకండి, లేకపోతే మీరు కష్టాల్లో పడవచ్చు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
వృషభం (Taurus): ఈ రాశి వారికి అంగారక సంచారం అశుభంగా ఉంటుంది. లవ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రయాణాలు అనుకూలించవు. విపరీతంగా ఖర్చు పెరగవచ్చు. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మిథునం (Gemini): ఈ సమయంలో మిథున రాశివారి ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకోండి. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇది సరైన సమయం కాదు. మీరు వ్యక్తిగతంగా కూడా సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది.
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండదు. వారి ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
మీనం (Pisces): ఈ రాశివారు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. మీరు ఈ సమయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఫ్యామిలీలో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
Also Read: Mars Transit 2022: వచ్చే నెలలో కుజుడి స్థానంలో పెను మార్పులు.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook