Sankranti 2023: సంక్రాంతికి ముందు ఈ 4 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

Makar Sankranti 2023: మకర సంక్రాంతికి ముందు వృషభ రాశిలో అంగారక సంచారం జరుగబోతుంది.  ఇది కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 11:50 AM IST
Sankranti 2023: సంక్రాంతికి ముందు ఈ 4 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

Mangal Gochar before Makar Sankranti 2023: అంతరిక్షంలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రానుంది. ఇది మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. సంక్రాంతికి ముందు వృషభరాశిలో అంగారకుడి సంచారం జరుగనుంది. మంగళదేవుడి సంచారం (Mars transit 2023) వల్ల కొందరిపై లక్ష్మీదేవి డబ్బు వర్షం కురిపించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మార్స్ సంచారం ఈ రాశులకు ప్రయోజనకరం
మేషరాశి (Aries): మంగళ గోచారం వల్ల మేష రాశి వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీరు ఫ్యామిలీతో మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాలున్నాయి. మీరు అంకితభావంతో మీ పనిని నిర్వర్తిస్తారు.
మిథున రాశి (Gemini): కుజుడు సంచార ప్రభావం మిథునరాశి వారిపై ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ వ్యాపారం విస్తరించాలనే ప్రణాళిక నెరవేరుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు కొన్ని విలువైన వస్తువులను బహుమతిగా పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది. 

కర్కాటక రాశి (Cancer): అంగారక సంచారం వల్ల కర్కాటక రాశి వారి కోరిక నెరవేరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పాటు కుటుంబ సౌఖ్యాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
తులారాశి (Libra): అంగారక సంచారం కారణంగా తుల రాశి వారికి ఉద్యోగ మార్పు అవకాశాలు ఏర్పడతాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. 

Also Read: Grah Gochar 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న మెర్క్యూరీ.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News