Mars Transit In Aries 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహాన్ని శక్తి, సోదరుడు, భూమి, ధైర్యం, శౌర్యం సూచికగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహం అన్ని గ్రహాలకు అధిపతిగా వ్యవహరిస్తుంది. అంగారకుడు గ్రహ సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై శుభ, అశుభ ప్రభావాలు పడతాయి. జాతకంలో అంగారక గ్రహం శుభస్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని..అదే జాతకంలో ప్రతికూల స్థానంలో ఉంటే అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 24వ తేదీన అంగారక గ్రహం తిరోగమన దశగా సంచారం చేయబోతోంది. దీంతో ఈ గ్రహంతో ముడిపడి ఉన్న రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
అంగారక గ్రహం సంచారంతో మేష రాశి వారికి సెప్టెంబర్ నెల నుంచి శుభప్రదమైన రోజులు మొదలవబోతున్నాయి. ఈ సమయంలో మేష రాశి వారు వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడతారు. ఇక ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు మీ పై అధికారుల మద్దతు లభించి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచైనా ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
సింహ రాశి:
సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సింహ రాశి వారు కూడా అంగారకుడి సంచారంతో వ్యాపారాల్లో చాలా లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో అదృష్టం రెట్టింపు పై ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. ఇక ఉద్యోగాలు చేసే వారికి సహోద్యోగుల మద్దతు లభించి..ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కష్టపడి పనిచేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంగారకుడు తీరవుగమనం కారణంగా కుటుంబం నుంచి కూడా శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి:
అంగారకుడి సంచారంతో ధనస్సు రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి బాస్ అండా దండలు లభించి..ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారంలో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook