Budhaditya Yog: జూలై 17న 2 గ్రహాల మహాయుతి.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

Budh Gochar 2023: ఇవాళ గ్రహాల రాకుమారుడు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. త్వరలో సూర్యుడు కూడా అదే రాశిలోకి వెళ్లనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2023, 04:45 PM IST
Budhaditya Yog: జూలై 17న 2 గ్రహాల మహాయుతి.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

Budh-Surya Yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను యుతి అంటారు. గ్రహాలు కాలానుగుణంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవాళ అంటే జూలై 08న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలోకి జూలై 17న సూర్యభగవానుడు ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధుడు తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైతే.. సూర్యుడు గౌరవం, ప్రతిష్ట, ఆత్మవిశ్వాసానికి కారకుడిగా భావిస్తారు. బుధాదిత్య యోగం వల్ల మూడు రాశులవారికి అదృష్టం కలిసిరానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
ఇదే రాశి యెుక్క లగ్న స్థానంలో అంటే మొదటి ఇంట్లో బుధుడు మరియు సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఇదే సమయంలో వ్యతిరేక రాజయోగం కూడా రూపొందుతోంది. దీంతో మీరు మంచి లాభాలను పొందుతారు. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకింగ్, పెట్టుబడి, దిగుమతి-ఎగుమతులతో సంబంధం ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు. సూర్యుని ప్రభావం వల్ల ఆఫీసులో మీకు గౌరవం లభిస్తుంది. 
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో అంటే అదృష్ట గృహంలో ఈ కూటమి ఏర్పడబోతుంది. దీంతో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 

Also Read: Budh Shukra yuti 2023: జూలై 25న కీలక పరిణామం.. ఈ మూడు రాశులకు కావాల్సినంత ధనం..

మకరరాశి
సూర్య, బుధల కూటమి మీ రాశిలోని ఏడవ ఇంట్లో అంటే వివాహ గృహంలో కూడా ఏర్పడుతోంది. దీంతో వ్యతిరేక రాజ్యయోగం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు పాత రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. 

Also Read: Surya Grahan 2023: త్వరలో రెండవ సూర్యగ్రహణం... ఈ రాశుల వారిపై చెడు ప్రభావం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News