Mercury-Sun Conjunction: మరో వారం రోజుల్లో బుధాదిత్య యోగం.. ఈ 3 రాశుల వారి కెరీర్ అద్భుతం!

Mercury-Sun Conjunction: సూర్యుడు, బుధుడు ఏ రాశిలో కలిసినా దానిని బుధాదిత్య యోగం అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య యోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరో వారం రోజుల్లో బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం మూడు రాశులవారికి మేలు చేస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 10:48 AM IST
  • ఒకే రాశిలోకి సూర్యుడు, బుధుడు
  • బుధాదిత్య యోగంతో మూడు రాశులకు ప్రయోజనం
Mercury-Sun Conjunction: మరో వారం రోజుల్లో బుధాదిత్య యోగం.. ఈ 3 రాశుల వారి కెరీర్ అద్భుతం!

Mercury-Sun Conjunction: ఈ నెల మధ్యలో సూర్యుడు, బుధుడు ఒకేరాశిలోకి ప్రవేశించనున్నారు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. జూలై 16న సూర్యభగవానుడు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు అర్ధరాత్రి బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. కర్కాటకరాశిలో ఈ రెండు రాశుల సంయోగం (Mercury and Sun Conjunction in Cancer) వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే కర్కాటక రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం మూడు రాశులవారికి బంఫర్ ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries): కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుల సంచారం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ కెరీర్ దుసుకుపోతుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ వస్తుంది. కొంచెం శ్రమిస్తే మీరు పరీక్ష మరియు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 

మిథునం (Gemini): మిథునరాశి వారికి బుధాదిత్య యోగం చాలా మేలు చేస్తుంది. మీ జీతం పెరగవచ్చు. కొత్త మార్గంలో ఆదాయం రావచ్చు. సీనియర్ల సపోర్టు లభిస్తుంది. ఈ సమయం వ్యాపారులకు చాలా లాభాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 

తుల (Libra): బుధుడు-సూర్యుడు కలయిక తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు. 

Also Read: Sravana masam Diet: శ్రావణమాసం సోమవారం వ్రతంలో ఏం తింటే మంచిది

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News