Astrology: మేషరాశిలో కలవబోతున్న గురుడు-శుక్రుడు... ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Guru Shukra Yuti 2024: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తును పెట్టుకుంటాయి. త్వరలో మేషరాశిలో గురుడు మరియు శుక్రుడు సంయోగం జరగబోతోంది. ఇది నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉండబోతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2024, 10:21 PM IST
Astrology: మేషరాశిలో కలవబోతున్న గురుడు-శుక్రుడు... ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Jupiter and Venus transit 2024: దేవతలు గురువైన బృహస్పతి, అసురుల అధిపతి అయిన శుక్రుడు కలయిక త్వరలో మేషరాశిలో జరగబోతోంది. గురు-శుక్ర సంయోగంతో కొందరి అదృష్టం మారబోతోంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.

కర్కాటకం: బృహస్పతి మరియు శుక్రుడి కలయిక కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు మీ స్కిల్స్ తో అందరి గౌరవాన్ని పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
ధనుస్సు: గురుడు మరియు శుక్రుడు కలయిక ధనుస్సు రాశి యెుక్క ఐదో ఇంట్లో జరగబోతోంది. దీంతో మీరు ఊహించనంత డబ్బును పొందుతారు. అంతేకాకుండా మీరు సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ ప్రేమ ఫలిస్తుంది. మీకు పదవి మరియు ప్రతిష్ట లభిస్తాయి. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Rajyog 2024: 15 ఏళ్ల తర్వాత మహాయోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

మేషం: ఈ రాశి యెుక్క లగ్న గృహంలోనే గురు-శుక్రుల కలయిక సంభవించబోతోంది. దీంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 
మిథునరాశి: మిథునరాశిలో శుక్రుడు, గురు గ్రహాలు పదకొండవ ఇంట్లో కలుసుకోబోతున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. 

Also Read: Copper Sun: ఇంట్లో రాగిసూర్యుడు…ఇక అదృష్టాల పంటే పంట..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News