October Horoscope 2022: అక్టోబర్ నెల అదృష్ట రాశులు ఇవే..! లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశులవారిపై డబ్బు వర్షం కురుస్తుంది!

October Rashifal 2022: కొన్ని రాశుల వారికి అక్టోబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఈ రాశులవారు ఊహించినంత ధనాన్ని పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2022, 04:07 PM IST
October Horoscope 2022: అక్టోబర్ నెల అదృష్ట రాశులు ఇవే..! లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశులవారిపై డబ్బు వర్షం కురుస్తుంది!

October 2022 Monthly Rashifal: మరో మూడు రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ఈ మాసంలోనే దసరా, ధంతేరస్ మరియు దీపావళి వంటి ప్రధాన పండుగలు రానున్నాయి. లక్ష్మీదేవి, కుబేరుడుల అనుగ్రహం పొందడానికి ఈ మాసం చాలా ప్రత్యేకమైనది.  ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. లక్ష్మీదేవి (Goddess Laxmi) అనుగ్రహంతో వీరు అపారమైన సంపదను పొందుతారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. 

అక్టోబరు అదృష్ట రాశులివే...
వృషభం (Taurus)- ఈ రాశి వారికి అక్టోబర్ నెల శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. 
సింహ రాశి (Leo)- సింహ రాశి వారికి అక్టోబర్ నెల మేలు చేస్తుంది. మీ రంగంలో మీరు రాణిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. ఆదాయం  పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 
వృశ్చిక రాశి (Scorpio)- ఈ రాశి వారికి అక్టోబర్ మాసం సంతోషం మరియు శ్రేయస్సును ఇస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయం కూడా పెరుగుతుంది. వివిధ ఆదాయ వనరులు ద్వారా డబ్బు సమకూరుతుంది. 

ధనుస్సు (Sagittarius)- అక్టోబర్ నెల ధనుస్సు రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. మీ వృత్తిలో రాణిస్తారు. కుటుంబంలో  సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితం సూపర్ గా ఉంటుంది. 
మకర రాశి (Capricorn)- వచ్చే నెల మకర రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రతి రంగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అనురాగాలు, అప్యాయతలు పెరుగుతాయి. లైఫ్ బిందాస్ గా ఉంటుంది.  
కుంభం (Aquarius)- కుంభ రాశి వారికి అక్టోబర్ నెల సానుకూల ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో భారీ మార్పు ఉంటుంది.. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి భారీగా లాభాలను ఆర్జిస్తారు.  లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. 

Also Read: Mangal Gochar October 2022: అక్టోబరులో అంగారక సంచారం... ఈ రాశులవారికి ఆర్థికంగా నష్టం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News