Muharram and Ashura 2022: ముస్లింలకు మొహర్రం ప్రత్యేకమైన రోజు. ఇస్లామిక్ హిజ్రి లేదా కొత్త సంవత్సరం మొహర్రంతో ప్రారంభం కానుంది. రంజాన్ తరువాత అత్యంత పవిత్రమైన నెల ఇది. మొహర్రం ప్రాముఖ్యతేంటి, అషురా అంటే ఏంటి, షియాలు, సున్నీలు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం..
ముస్లింల ఇస్లామిక్ కేలండర్ చంద్రమానం ప్రకారం ఉంటుంది. ఏడాదికి 354 రోజులు, 12 నెలలతో ఉండే ఇస్లామిక్ సంవత్సరంలో తొలి నెల మొహర్రం. ఈ ఏడాది మొహర్రం నెల జూలై 31న ప్రారంభమైంది. రంజాన్ తరువాత ప్రాధాన్యత కలిగిన నెల ఇది. మొహర్రం అనేది అరబిక్ పదం. దీనర్ధం నిషేధించబడిందని. మొహర్రం పదవరోజుని అషురా అని పిలుస్తారు. ఈరోజుకు చాలా ప్రాధాన్యత ఉంది.
అషురా ప్రాధాన్యత
అషురా రోజున అంటే మొహర్రం నెలలో పదవ రోజున మూసా ప్రవక్త...క్రైస్తవులకు మోసెస్..క్రూరుడైన ఫిరౌన్ చక్రవర్తిని అల్లాహ్ సహాయంతో, విశ్వాసుల మద్దతుతో ఓడించారు. ఇదే రోజున మొహమ్మద్ ప్రవక్త 622 వ సంవత్సరంలో మక్కా నుంచి మదీనాకు..అనుచరులతో సహా వలస వచ్చారు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా మక్కాలో మొహమ్మద్ ప్రవక్తను లక్ష్యంగా చేసుకుని వేధిస్తుండటంతో వలస రావల్సి వచ్చింది. ఇదే రోజున నూహ్ ప్రవక్త తన నావతో తుపాను నుంచి సంరక్షించుకుని తీరానికి చేరారు. ఇదే రోజున కర్బలా మైదానంలో మొహమ్మద్ ప్రవక్త మనుమడు, హజ్రత్ అలీ కుమారుడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ప్రాణాలర్పించారు. షియా ముస్లింలు దీనికోసం అషురా రోజున సంతాప దినంగా గడుపుతారు.
అషురా రోజున షియాలు, సున్నీలకు తేడా
మొహర్రం 9, 10వ రోజుల్ని సున్నీలు ఉపవాసం ఉండి అల్లాహ్ ధ్యానంలో గడుపుతారు. మొహమ్మద్ ప్రవక్త ఇలా ఆచరించి చూపించారు. మరోవైపు షియా ముస్లింలు మొహర్రం పదిరోజులు సంతాప దినాలుగా ఆచరిస్తారు. కర్బలా మైదానంలో మొహమ్మద్ ప్రవక్త మనుమడు, హజ్రత్ అలీ కుమారుడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ప్రాణత్యాగానికి ప్రతీకగా సంతాపం నిర్వహిస్తారు.
Also read: HDFC Interest Rates: హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు షాక్, అన్ని రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook