Nag Panchami 2022: నాగ పంచమికి మరి కొద్దిరోజులే మిగిలుంది. ఆ రోజున పాముల్ని పూజించడం ఓ ఆనవాయితీ. సర్పదోషం దూరం చేసేందుకు మంచి అవకాశంగా భావిస్తారు. ఈ సందర్భంగా పాములకు సంబంధించిన కొన్ని రహస్య విషయాలు తెలుసుకుందాం..
శ్రావణమాసం శుక్లపక్షం పంచమ తిధిన నాగ పంచమి జరుపుకుంటారు. ఆ రోజున నాగదేవత పూజలు చేస్తారు. 2022లో నాగ పంచమి ఆగస్టు 2, మంగళవారం ఉంది. దేశంలోనూ, ప్రపంచంలోనూ పాములకు సంబంధించిన చాలా కధలు ప్రచారంలో ఉన్నాయి. పాములకు సంబంధించిన ఆ రహస్య విషయాలు లేదా ఎవరికీ తెలియని అంశాలు తెలుసుకుందాం..
పాము గుడ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. పాము గుడ్లు మెరుస్తుంటే అవి మగపాము గుడ్లని అర్ధం. అదే ప్రకాశహీనంగా ఉంటే ఆడపాము గుడ్లుగా భావిస్తారు. పాము తన గుడ్లను ఆరు నెలలవరకూ పొదిగిన తరువాత పిల్లలు వస్తాయి. చాలావరకూ పిల్లల్ని పామే తినేస్తుంది. తల్లి పాము దృష్టి నుంచి తప్పించుకునేవి మాత్రం బతికిపోతాయి. పాములు వర్షాకాలంలో గర్భం ధరిస్తాయి. కార్తీక మాసంలో పిల్లలు బయటకు వస్తాయి.
గుడ్ల నుంచి బయటకు వచ్చిన 7 రోజుల తరువాతే పాము పిల్లలకు దంతాలు వస్తాయి. 21 రోజుల తరువాత విషయం పుడుతుంది. విషపూరితమైన పామైతే...25 రోజుల తరువాతే ప్రాణం తీయగలవు. పరిశోధకుల ప్రకారం పాము వందేళ్ల వరకూ బతకగలదు. అత్యధికంగా 120 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఇంతకాలం జీవించే పాము జాతులు చాలా తక్కువనే చెప్పాలి.
పాము కాళ్లు పైకి కన్పించవు కానీ ఉంటాయి. అత్యంత చిన్నవిగా ఉన్నందున పైకి కన్పించవు. అదే సమయంలో పాము పాకేటప్పుడే కాళ్లు బయటకు వస్తుంటాయి. మిగిలిన సమయంలో చర్మం లోపలకు పోయుంటాయి. పాము వయస్సు, విషపూరితపు నిర్ధారణ అనేది పుట్టిన స్థితిని బట్టి ఉంటుంది. అంటే నిర్ధారిత సమయం కంటే ముందే గుడ్ల నుంచి బయటకు వస్తే ఆ పాము వయస్సు 40-45 ఏళ్లే ఉంటుంది. అదే సమయంలో అటువంటి పాముల్లో విషం కూడా తక్కువ లేదా తక్కువ ప్రభావం కలిగింది ఉంటుంది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook