Navaratri 2020: హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా భక్తులంతా తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అందిస్తే కోరుకున్న కోరికలు నెరవేరి.. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎంతో ప్రాముఖ్యమైనవి. అంతేకాకుండా శుభప్రదమైనవిగా భావించవచ్చు. ఈ క్రమంలో తొమ్మిది రోజులపాటు ఎలాంటి శుభకార్యాలు జరుపుకున్న శుభప్రదమైనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా చాలామంది ఈ సమయంలో కొత్త కొత్త వస్తువులను వాహనాలను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు.
శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి..?
ప్రతి సంవత్సరం లాగా కాకుండానే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 26 సోమవారం నుంచి ఈ పవిత్రమైన శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. దీంతో శుభ ఘడియలు కూడా మొదలవుతాయని శాస్త్రం చెబుతోంది. అయితే విగ్రహాలను ప్రతిష్టించేవారు సెప్టెంబర్ 26న ప్రతిష్టించి.. అక్టోబర్ 5న(విజయదశమి) నిమజ్జనం రోజున నిమజ్జనం చేస్తారు.
నవరాత్రులు మంచి ముహూర్తాలేనా..?
హిందూ గ్రంధాల ప్రకారం తొమ్మిది రోజుల నవరాత్రులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. తిధులు ముహూర్తాలు కూడా మంచివిగా చెబుతూ ఉంటారు. వివాహం కోసం ఈ గడియాల్లో తాంబూలాలు మార్చుకోవచ్చు. పరిచయాలు కూడా పెంచుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ తొమ్మిది రోజులపాటు శుభ ఘడియలు ఉండడంతో అన్ని రకాల శుభ కార్యక్రమాలను చేసుకోవచ్చు. ముఖ్యంగా నిశ్చితార్థాలను కూడా చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది.
ఈ నిశ్చితార్దాల్లో భాగంగా వధువు మొదటగా వరుడుని చూడాల్సి ఉంటుంది. ఇలా చూడడమే ఉత్తమమైనదని మత గ్రంథాలు చెబుతున్నాయి. ఇలాంటి నియమం పాటించడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. ఇక వ్యాపారాల విషయానికొస్తే ఈ తొమ్మిది రోజుల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు సక్రమంగా ప్రారంభించుకోవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించే క్రమంలో తప్పకుండా అమ్మవారిని పూజించి ప్రారంభిస్తే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook