Palm Reading: అరచేతిలో విధి రేఖను చూసి అదృష్టవంతులో కాదో చెప్పొచ్చు.. ఇదిగో ఇలా..

Palm Reading Fate Line:  హస్తసాముద్రికం ప్రకారం అరచేతిలో విధి రేఖను చూసి ఆ వ్యక్తి అదృష్టవంతుడో కాదో చెప్పొచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 04:27 PM IST
  • అరచేతిలో విధి రేఖ ప్రభావం
  • విధి రేఖను బట్టి వ్యక్తి స్థితి గతులు చెప్పొచ్చు
  • విధి రేఖ ప్రభావంతో అదృష్టం లేదా దురదృష్టం
 Palm Reading: అరచేతిలో విధి రేఖను చూసి అదృష్టవంతులో కాదో చెప్పొచ్చు.. ఇదిగో ఇలా..

Palm Reading Fate Line: హస్తసాముద్రికం ఒక వ్యక్తి జీవితంలోని ప్రతీ అంశాన్ని చెప్పగలదు. చేతిలోని వివిధ రేఖల స్థానాన్ని పరిశీలించి ఆ వ్యక్తి స్థితి గతులు చెప్పవచ్చు. ఇప్పుడు మనం విధి రేఖ గురించి తెలుసుకుందాం. చేతిలోని వివిధ స్థానాల్లో ఉండే ఈ రేఖ వివిధ సంకేతాలను సూచిస్తుంది. దాని ద్వారా సదరు వ్యక్తి తన జీవితంలో విజయవంతమవుతాడా లేదా అని చెప్పవచ్చు.

అరచేతిలో విధి రేఖ.. దాని ప్రభావం :

అరచేతిలో ఉండే విధి రేఖ ఒక వ్యక్తి విజయం లేదా వైఫల్యానికి సంకేతం. ఈ రేఖ అరచేతి మధ్యలో నిలువుగా ఉంటుంది.

అరచేతిలోని విధి రేఖ మధ్య వేలు కింద శని గ్రహం నుంచి అరచేతి నడికట్టు వరకు వెళితే.. అలాంటి వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అతను జీవితంలో విజయవంతమవుతాడు. ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా విజయం సాధిస్తాడు.

విధి రేఖ అరచేతి నడికట్టు వరకు ఉండి.. పైన ఉన్న శని పర్వతం గుండా రెండు భాగాలుగా విభజించబడి... అందులో కొంత భాగం గురు పర్వతం కిందకు, అంటే చూపుడు వేలు కిందకు వెళితే... అటువంటి వ్యక్తి దాతగా లేదా పరోపకారిగా గుర్తింపు పొందుతాడు. జీవితంలో అతను ఉన్నత స్థానానికి చేరుతాడు.

విధి రేఖ అరచేతి మధ్య నుంచి శని గ్రహం వరకు వెళ్లినా ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తులు సాధారణ లేదా పేద కుటుంబంలో పుట్టినా ఐశ్వర్యవంతులవుతారు.

హస్తసాముద్రికం ప్రకారం ఒకవేళ విధి రేఖ రెండుగా చీలిపోయినట్లు ఉంటే ఆ వ్యక్తిని దురదృష్టం వెంటాడుతుంది. జీవితంలో చాలా పోరాడాల్సి వస్తుంది. ఎంత కష్టపడినా సరైనా ఫలితాలు పొందలేకపోతారు.

Also Read: Viral Crime News: ఆమ్లెట్ వేసివ్వలేదని భార్య గొంతు నులిమి చంపిన భర్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News