Palmistry: అరచేతిలో ఈ రేఖలు ఉన్న వ్యక్తులు పదే పదే మోసపోతుంటారు!

Palmistry:  హస్తసాముద్రికంలో శుభ మరియు అశుభ రేఖలు, బొమ్మలు మరియు సంకేతాలు రెండూ చెప్పబడ్డాయి. దీనితో పాటు జీవితంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో కూడా చెప్పబడింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 01:46 PM IST
Palmistry: అరచేతిలో ఈ రేఖలు ఉన్న వ్యక్తులు పదే పదే మోసపోతుంటారు!

Lucky Unlucky Lines in Palm: హస్తసాముద్రికం (Palmistry) ప్రకారం, వ్యక్తి యెుక్క మానసిక స్థితి ఎలా ఉందో చేతిలోని గీతలను బట్టి చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు పదే పదే మోసపోతుంటారు.  దానికి కారణం వారి అరచేతిలోని రేఖలే. అలాంటి కొన్ని రేఖలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రేఖలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. 

>> బంధుత్వాలైనా, డబ్బులైనా, ప్రతి విషయంలోనూ కొందరు మళ్లీ మళ్లీ నష్టపోతారు. వీరు ఇతరుల మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దీన్ని చేతి రేఖల ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

>> హార్ట్ లైన్ హెడ్ లైన్‌పై పడినట్లు కనిపిస్తే, అలాంటి వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుని మోసపోతారు. అంతే కాకుండా ఇలాంటి వారు ఆర్థిక విషయాల్లో కూడా చాలా నష్టపోతారు. ప్రజలు వీరి నుండి డబ్బు తీసుకుంటారు గానీ తిరిగి ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు వారికి జీవితాంతం జరుగుతూనే ఉంటాయి. 

>> అదేవిధంగా హార్ట్ లైన్ హెడ్ లైన్‌పై పడి దానిని కత్తిరించినట్లయితే, దానిని మంచి సంకేతం అని చెప్పలేము. అలాంటి వారే మళ్లీ మళ్లీ మోసానికి గురవుతారు. 

>> హృదయ రేఖ తల రేఖపై పడితే, అదే సమయంలో దాని నుండి గురు పర్వతం వరకు ఒక రేఖ ఉద్భవిస్తే, అలాంటి వ్యక్తి కూడా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేడు. ఫలితంగా అతడు మోసపోతాడు. కానీ తర్వాత దీనిపై కొంచెం అవగాహన వస్తుంది.  

>> ఎవరి చేతుల్లోని హృదయ రేఖ నుండి నేరుగా వెళ్లే రేఖ హెడ్ లైన్‌తో కలుస్తుందో, అలాంటి వ్యక్తి కొంతమంది వ్యక్తుల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. వారు ఆ వ్యక్తిని ఎంత మోసం చేసినా.. వారే కావాలంటాడు. 

>> హృదయ రేఖ పూర్తిగా హెడ్ లైన్‌పై వంగి ఉంటే, అలాంటి వ్యక్తులు చాలా డబ్బు నష్టపోతారు మరియు దీని కారణంగా వారి జీవితం నాశనం అయ్యే దశకు చేరుకుంటుంది. 

Also Read: Sun Transit 2022: మరో 9 రోజుల్లో రాశిని మార్చబోతున్న సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News