Papankusha Ekadashi 2023: హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథిలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శాస్త్రం ప్రకారం అన్ని ఏకాదశుల్లో విష్ణుమూర్తిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆశ్విన మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున వచ్చే పాపాంకుశ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్వామివారి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం ఈ ఏకాదశి నవంబర్, అక్టోబర్ నెలల్లో వస్తుంది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన వచ్చింది. ఈ ఏకాదశి రోజున స్వామివారిని ఎలా పూజించాలో.. ఏయే సమయాల్లో పూజించడం వల్ల మోక్షం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పాపాంకుశ ఏకాదశి రోజునే రవి యోగం ఏర్పడుతోంది:
చాలా సంవత్సరాల తర్వాత పాపాంకుశ ఏకాదశి రోజున రవి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా శుభ సమయం పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం రవి యోగం చాలా శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు. ఈ యోగంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు పొందుతారు. రవియోగం ఉదయం 06:28 నుంచి ప్రారంభమై.. మధ్యాహ్నం 01:30 వరకు ఉంటుంది.
పాపాంకుశ ఏకాదశి 2023 శుభ సమయం:
ఏకాదశి తిథి 24 అక్టోబర్ 2023న మధ్యాహ్నం 03:14 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 25న మధ్యాహ్నం 12:32 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
పాపాంకుశ ఏకాదశి పూజ ముహూర్తం 2023:
ఈ ఏకాదశి ఉపవాసాలు చేసేవారు తప్పకుండా శుభ సమయాల్లోనే పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. మంచి ముహూర్తంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి.
మొదటి ముహూర్తం: ఉదయం 04:46 నుంచి 05:37 వరకు..
రెండవ ముహూర్తం : ఉదయం 05:11 నుంచి 06:28 వరకు..
మూడవ ముహూర్తం: ఉదయం 05:42 నుంచి 06:08 వరకు..
నాల్గవ ముహూర్తం: సాయంత్రం 05:42 PM నుంచి 06:59 వరకు..
ఐదవ ముహూర్తం: ఉదయం 06:53 నుంచి 08:21 వరకు..
ఆరవ ముహూర్తం: ఉదయం 06:28 నుంచి 01:30 సాయంత్రం వరకు
పాపాంకుశ ఏకాదశి 2023 ఉపవాస సమయం:
పాపాంకుశ ఏకాదశి ఉపవాసం అక్టోబర్ 26న పాటించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉపవాస వ్రతాలు చేసేవారు ఉదయం 06:28 నుంచి ప్రారంభించి 08:43 సాయంత్రం విరమించాల్సి ఉంటుంది.
ఏకాదశి పూజా విధానం:
ఈ ఉపాసాన్ని పాటించేవారు ఉదయాన్నే నిద్ర లేచి కాలస్నానం చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఇంట్లో ఉన్న గుడిని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి.
ఆ తర్వాత గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి.
ఇలా చేసిన తర్వాత స్వామివారికి పూలు, తులసి తో తయారు చేసిన మాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఉపవాసాలు పాటించి స్వామికి హారతిని ఇవ్వాల్సి ఉంటుంది.
విష్ణుమూర్తి తో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.