Rahu Ketu Dosh Upay: జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతు గ్రహాల గురించి చాలా క్లుప్తంగా వివరించారు. ఎవరి జాతకంలో రాహు కేతు దోషాలు ఉంటాయో.. వారి జీవితమంతా చీకటిగా మారుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రాహు కేతు చెడు ప్రభావం ఉన్నవారు జీవితంలో ఎలాంటి విజయాలకు సాధించలేరు.. విజయాలు సాధించిన వాటి ఫలితాలు మీకు దక్కక పోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలామంది పై రాహుకేతు ప్రభావం పడుతోంది.
కొందరి జాతకాల్లో రాహుకేతువులు శుభప్రదంగా ఉన్న.. వారు జీవితంలో మంచి ఫలితాలు పొందలేక పోతారు. అంతేకాకుండా జీవితంలో సంతోషంగా ఉండలేక పోతారు. కాబట్టి ఈ క్రమంలో రాహుకేతు శాంతి నివారణలు పాటించాల్సి ఉంటుంది. దీనికోసం జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల నివారణలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల సులభంగా రాహుకేతు చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాహు కేతు పరిహారం:
-రాహు కేతు చెడు ప్రభావం ఉన్నవారు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న విధంగా తప్పకుండా దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దుర్గాదేవికి ఇష్టమైన రోజున ఉపవాసాలు పాటించడం వల్ల రాహుకేతు చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
-అంతేకాకుండా జ్యోతి శాస్త్రంలో పేర్కొన్న విధంగా శ్రీకృష్ణుడు నిత్యం చేస్తున్న చిత్రాలను పూజించాలి. ఈ పూజా కార్యక్రమంలో 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
-జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాహు కేతు బీజ మంత్రాలను పాటించడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషాలు పోతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. దీనికోసం ప్రతిరోజు పూజా క్రమంలో రాహుకేతు బీజ మంత్రాలను పఠించాల్సి ఉంటుంది.
-మత విశ్వాసాల ప్రకారం.. రాహు కేతు చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి పేద అమ్మాయికి పెళ్లికి సంబంధించిన సహాయ సహకారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి