Rahu Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతు గ్రహాలను అంతుచిక్కని గ్రహాలుగా పరిగణిస్తారు. అక్టోబర్ 30వ తేదీన రాహు గ్రహం మేష రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ మార్పుల కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా సుమారు ఒకటిన్నర సంవత్సరాల పాటు కొన్ని రాశుల వారికి అనేక రకాల సమస్యలతో పాటు మానసిక ఆందోళన ఎదురయ్యే అవకాశాలున్నాయి. రాహు సంచారం కారణంగా ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి:
కన్యా రాశి వారు రాహు సంచారం కారణంగా జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో బలే రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే వ్యాపార భాగస్వాములతో సంబంధాలు చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంచారం వ్యాపారం పై ప్రభావం చూపడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు. ఏదైనా నిర్ణయం తీసుకునే క్రమంలో తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయంలో భాగస్వాముల మధ్య విభేదాలు రావచ్చు. అయితే ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య దూరం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు. రాహు సంచారం కారణంగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంచారం వీరికి సమాజంలో స్థాయిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా శత్రువులపై విజయాలు సాధించేందుకు కూడా ఈ సంచారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక సంబంధాల విషయాల్లో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభరాశి:
రాహు సంచారం కారణంగా కుంభ రాశి వారు ఈ సమయంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గౌరవం పొందడానికి చేసే ప్రయత్నాలు ఈ రాశి వారి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సంబంధాలలో కూడా అనేక విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆత్మీయులకు మధ్య విభేదాలు పెరగవచ్చు. కుటుంబ వాతావరణంలో ఒత్తిడి కూడా రావచ్చు.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ సమయంలో ఆశించని ఫలితాలు రాకపోవడం వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదురవచ్చు. ఈ రాశి వారు తప్పకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు పాటించి వాదనలకు దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.