Rahu Rashi Parivartan 2023: శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు ఒకటి. ఇది ఏడాదిన్నరకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. ఛాయా గ్రహమైన రాహువు 12 ఏప్రిల్ 2022 ఉదయం 11.58 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 30 తెల్లవారుజామున 2.13 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. దీని తర్వాత అతడు బృహస్పతి యాజమాన్యంలో ఉన్న మీనరాశిలోకి వెళ్తాడు. దుష్ట గ్రహమైన రాహువు ఎప్పుడు చెడు ఫలితాలనే కాదు అప్పుడప్పుడు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. మేషరాశిలో రాహువు సంచరించడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కుంభ రాశి
ఈ సంచారం జాతకంలోని మూడో ఇంట్లో రాహువు సంచరిస్తున్నాడు. రాహువు సంచారం వల్ల మీ వ్యాపారం విస్తరిస్తుంది. అంతేకాకుండా మీరు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కోరుకున్నది లభిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలోని ఆరో ఇంట్లో రాహువు కూర్చుని ఉన్నాడు. దీని వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్‌తో పాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహం
రాహువు ఈ రాశి యెుక్క 10వ ఇంట్లో కూర్చున్నాడు. మీరు ప్రతి లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. ఈసమయంలో ఉద్యోగులు లాభపడతారు. రాహు చెడు ప్రభావాలను నివారించడానికి శివలింగంపై జలాభిషేకం చేయండి.
Also Read: Shukra Mangal yuti 2023: సింహరాశిలో శుక్రుడు, కుజుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
కర్కాటకం
ఈ రాశి యెుక్క కర్మ గృహంలో రాహువు సంచరించబోతున్నాడు. దీని వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. వ్యాధులు దూరమవుతాయి. ఐటీ రంగాలకు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కుక్కకు పాలు, రొట్టెలు ఇవ్వడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
(Disclaimer:ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Ketu Gochar 2023: కేతు సంచారంతో ఈ రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook