Rammandir Features: రామాలయం లోపల ఎలా ఉంటుంది, ఎంట్రీ, ఎగ్జిట్ ఎలా ఉంటాయి, ఏయే వసతులుంటాయి

Rammandir Features: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్నించి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో రామమందిరం విశషాలతో కూడిన చిత్రపటం విడుదలైంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 30, 2023, 07:07 AM IST
Rammandir Features: రామాలయం లోపల ఎలా ఉంటుంది, ఎంట్రీ, ఎగ్జిట్ ఎలా ఉంటాయి, ఏయే వసతులుంటాయి

Rammandir Features: కొత్త ఏడాదిలో జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దేశ విదేశాల్నించి లక్షలాది భక్తులు తరలిరానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. ఆలయం ప్రవేశం, నిర్మాణం ఎలా ఉంటుంది ఇతర వివరాలు, చిత్రపటాన్ని రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. 

అయోధ్య రామాలయం విశేషాలు...

ఆలయ నిర్మాణం మూడు అంతస్థుల్లో ఉంటుంది. తూర్పు నుంచి ప్రవేశించి దక్షిణం వైపు నుంచి బయటకు రావాలి. 

ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 

సాంప్రదాయ నాగరా శైలిలో ఆలయాన్ని నిర్మింాచరు. 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్థు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్థంభాలు, 44 ద్వారాలుంటాయి. 

ఉత్తర దిశన ఉండే దేవాలయాలకు గర్భగుడి చుటూ బయటి భాగముండదు. కానీ రామాలయం 14 అడుగుల వెడల్పు, 732 మీటర్ల విస్తీర్ణంలో పేర్కోటా ఉంటుంది. 

పెర్కోటా నాలుగు మూల్లో సూర్యుడు, మా భగవతి, గణేశుడు, శివుడికి అంకితం. ఉత్తరాన అన్నపూర్ణ, దక్షిణాన హనుమంతుడి మందిరం ఉంటాయి. 

ఇక మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ట, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, మాతా శబరి, దేవి అహల్య మందిరాలుంటాయి. అయోధ్యలోని కుబేర్ తిల వద్ద జటాయువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

రామాలయం కాంప్లెక్స్‌లో ఆరోగ్య సంరక్షణ కేంద్రం, టాయిలెట్ బ్లాక్, ఇతర సౌకర్యాలుంటాయి. దర్శనానికి వెళ్లే ముందు బూట్లు, చెప్పులు, వాచీలు, మొబైల్ ఫోన్స్ 25 వేలమంది డిపాజిట్ చేసుకోవచ్చు. 

వేసవిలో చెప్పుల్లేకుండా నడవాల్సిన అవసరం లేకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లుంటాయి.

మొత్తం 70 ఎకరాల ఆలయ ప్రాంగణంలో 70 శాతం పచ్చని ప్రాంతంగా ఉంటుంది. వందేళ్లకు పైగా పురాతన చెట్లుంటాయి. సూర్య కిరణాలు సోకని దట్టమైన వనముంటుంది. 

రామమందిరం ఆలయ సముదాయంయలో రెండు మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, నీటి శుద్ధి ప్లాంట్, ప్రత్యేక విద్యుత్ లైన్ ఉంటాయి. భూగర్భ జలాశంయ నుంచి నీటిని తీసుకునే అగ్నిమాపక దళ విభాగం పనిచేస్తుంటుంది. 

Also read: kanuma Panduga: 2024లో కనుమ పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ ఫెస్టివల్ కు, పశువులకు సంబంధం ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News