Sun Transit Today: ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. అయితే ఈ సూర్యగ్రహం కేవలం కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే సంచారం చేస్తుంది. సూర్యుడు సంచారం కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహం ఈ రోజు సంచారం చేసింది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ప్రత్యేక రాజయోగం కూడా ఏర్పడబోతోంది. సూర్యుడు వ్యక్తిగత జాతకంలో 8వ, 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సూర్యుడి సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై సూర్యగ్రహ సంచార ప్రభావం:
మేషరాశి:
సూర్యుని సంచారం మేషరాశి వారిపై ప్రత్యేక్షంగా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయంలో ఇంతక ముందు ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. దీంతో పాటు గౌరవం, కీర్తి కూడా పెరుగుతుంది. అలాగే మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది.
తులారాశి:
తుల రాశి వారికి ఈ రాజయోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. అంతేకాకుండా దృష్టి కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.ఉద్యోగాలు చేసేవారు కార్యాలయాల్లో ప్రశంసలు అందుకుంటారు. ఇదే సమయంలో కోర్టు కేసుల్లో విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో సమయం గడపే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్ కేవలం రూ.12,499కే..ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు..
మకర రాశి:
సూర్య గ్రహం సంచారం మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. విద్యార్థులకు ఈ రోజు నుంచే మంచి రోజులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో ఊహించని లాభాలు కూడా పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook