Budh Gochar December 2022: డిసెంబర్ నుండి కొన్ని రాశులవారికి సమయం అంతగా కలిసి రాకపోవచ్చు. ఈ సమయంలో వారు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. డిసెంబరు 31న బుధుడు తిరోగమన స్థితిలో ధనుస్సు రాశిలో (Budh Gochar December 2022) సంచరించనున్నాడు. దీంతో కొందరు ఇబ్బందులకు గురవుతారు. తిరోగమన బుధుడి సంచారం ఏ రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
తిరోగమన బుధుడి సంచారం ఈ రాశులకు నష్టం
మేషం (Aries): తిరోగమన బుధుడు సంచారం కారణంగా ఈరాశివారు వ్యాపారంలో అనేక అడ్డంకులను ఎదుర్కోంటారు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు రావచ్చు. ఆర్థిక సమస్యలను ఎదుర్కోంటారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు గురవుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది.
వృషభం (Taurus): మీరు వృత్తి మరియు వ్యాపారల్లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఇతరులతో మీ సంబంధాలు చెడిపోతాయి. ఆఫీసులో మీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈసమయంలో మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
సింహరాశి (Leo): సింహ రాశి వ్యక్తులు తిరోగమన బుధుని సంచారం వల్ల వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందలేరు. మీరు అనేక రుగ్మలతో బాధపడే అవకాశం ఉంది.
తిరోగమన బుధుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
తుల రాశి (Libra): తిరోగమన బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి కాలం బాగానే ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. మీరు వ్యాపారంలో కూడా లాభపడవచ్చు.
కుంభం(Aquarius): ఈ రాశివారు బుధుడి సంచారం వల్ల అపారమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read; Guru Margi 24 November 2022: ఈ రాశువారికి గురు మార్గి వల్ల విపరీతమైన డబ్బే..డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook