June Grah Gochar 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనది. జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. మరో పది రోజుల్లో కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ వ్యతిరేక కదలిక కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.
కుంభ రాశి: ఈ రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీకు జాబ్ ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆఫీసులో సహద్యోగుల సహకారం లభిస్తుంది. మీరు అనుకున్నది సాధిస్తారు.
మేషరాశి: త్రికోణ రాజయోగం మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Also read: Mercury transit 2023: ఈరోజు నుండి ఈ 4 రాశుల జీవితం అల్లకల్లోలం.. మీరున్నారా?
వృషభ రాశి: త్రికోణ రాజయోగం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే తగిన సమయం. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. హఠాత్తుగా మీ చేతికి డబ్బు అందుతుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం శుభప్రదంగా ఉంటుంద. ఈరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వీరి ఆదాయం మెరుగుపడుతుంది. వీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
Also read: Shash Rajayogam 2023: జూన్ 17న శష్ రాజయోగం..ఈ 3 రాశులకు కలిసిరానున్న కాలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook