Saturn Remedies: ప్రతి శనివారం ఈ 5 ఉపాయాలు పాటిస్తే మీరిక కోటీశ్వరులే

Saturn Remedies: హిందూమతం ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి అమితమైన ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క అంశానికి కారకుడిగా పిలుస్తారు. శని గ్రహాన్ని న్యా య దేవతగా, అత్యంత నిష్టూరమైన, కఠోరమైన గ్రహంగా భావిస్తారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2023, 06:20 AM IST
Saturn Remedies: ప్రతి శనివారం ఈ 5 ఉపాయాలు పాటిస్తే మీరిక కోటీశ్వరులే

Saturn Remedies: అందుకే శని గ్రహానికి సంబంధించిన అంశాలు జాతక రీత్యా అత్యంత ప్రభావితమయ్యేవిగా ఉంటాయి. అందుకే శని దేవుడిని ఆరాధించే విషయంలో కొన్ని సూచనలున్నాయి. ప్రతి శనివారం శనిని పూజించడం వల్ల శని గ్రహం కటాక్షంతో అమితమైన లాభాలు పొందవచ్చని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

హిందూమతం ప్రకారం శని గ్రహం న్యాయ దేవత. మనిషి లేదా జీవాలు చేసే పనుల ఆధారంగా ప్రతిఫలం ఉంటుంది. తప్పు చేస్త్ అందుకు తగ్గ శిక్ష ఉన్నట్టే మంచి చేస్తే లాభాలుంటాయి. శని దేవుడికి ఉన్న ఈ ప్రత్యేకత కారణంగానే అందరూ పూజలు పునస్కారాలతో వివిధ రకాల పద్ధతులతో శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇవాళ మనం శని గ్రహానికి సంబంధించి 5 ఉపాయాల గురించి తెలుసుకుందాం. ఈ 5 ఆచరిస్తే ఇక జీవితంలో మీకు తిరుగే ఉండదు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహిళలు, పురుషులు ఇరువురూ శని దేవతకు సమానంగా పూజలు చేయాలి.  శని దేవతను పూజించేటప్పుడు ఓ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. శని దేవతను ముట్టుకోకూడదు. ఈ హక్కు కేవలం ఆలయంలోని పూజారికి మాత్రమే ఉంటుంది. ఇక ప్రతి శనివారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల  ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దాంతోపాటు ఆవులకు అన్నం పెట్టాలి. రావిచెట్టు కింద నల్ల నవ్వులు వేసి గానుగ నూనెతో  దీపం వెలిగించాలి. ఈ రోజుల గుడికి వెళ్లి హనుమంతుడిని పూజించాలి. 

జ్యోతిష్యులు చెప్పిందాని ప్రకారం శని దేవుడికి ఇష్టమైన ఆహారం కిచిడీ. అందుకే శని దేవుడికి కిచిడీ ప్రసాదంగా సమర్పించాలి. దాంతోపాటు కిచిడీ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. కుండలిలో శని స్థితి బలంగా ఉండటమే కాకుండా ప్రసన్నుడౌతాడు. కోరిన వరాలు ఇస్తాడు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి శనివారం నాడు స్నానం చేసిన తరువాత అత్యంత భక్తి శ్రద్ధలతో శని దేవుడిని ఆరాధించాలి. శని చాలీసా మంత్రాన్ని పఠించాలి. మరీ ముఖ్యంగా సుందరకాండను తప్పకుండా చదవాలి. ఇలా చేయడం వల్ల శని గ్రహం తప్పకుండా ప్రసన్నుడౌతాడు. 

శనివారం నాడు కాకులకు ఆహారం పెట్టాలి. దీనివల్ల పూర్వికులు సంతృప్తి చెందుతారు. వారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. దీంతోపాటు శనివారం నాడు నల్ల చెప్పులు, నల్ల గొడుగు, నల్ల బట్టలు, నల్ల మినపపప్పు దానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ 5 ఉపాయాలు తప్పకుండా పాటిస్తే శని గ్రహం మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది. శని కటాక్షంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతులేని ధనం లభిస్తుంది. 

Also read: Zodiac Sign: సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ధనవంతులు అవ్వబోతున్న 4 రాశుల వారి వీరే..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x