Saturn Retrograde 2023: మరో నెల రోజుల్లో ఈ రాశుల అదృష్టం మారనుంది.. ఇందులో మీది ఉందా?

Shani Vakri 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. ఇతడి గ్రమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శని తిరోగమనం కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 10, 2023, 04:05 PM IST
Saturn Retrograde 2023: మరో నెల రోజుల్లో ఈ రాశుల అదృష్టం మారనుంది.. ఇందులో మీది ఉందా?

Benefits of Kendra Trikon Rajyog: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని ఛేంజ్ చేస్తాడు. ఈ ఏడాది జనవరి 17న శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించాడు. జూన్ 17న ఇదే రాశిలో శని తిరోగమనం చేయనున్నాడు. నవంబరు 4 వరకు శని ఇదే స్థితిలో ఉండబోతున్నాడు. శని వక్రీ కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీనిని అదృష్ట యోగంగా భావిస్తారు. ఈయోగం వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం. 

మిధునరాశి
మీ జాతకంలో తొమ్మిదో ఇంట్లో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీకు ప్రతి పనిలో  అదృష్టం కలిసి వస్తుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. ఏదైనా పరిశోధన పనిలో నిమగ్నమైన వారు మంచి ఫలితాలను పొందుతారు. 
సింహరాశి 
తిరోగమన శని కారణంగా సింహరాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

Also Read: Shani Dev: శష్ మహాపురుష రాజయోగం ఈ 3 రాశుల వారికి ప్రత్యేకం.. ఇందులో మీరాశి ఉందా?

వృషభం
కుంభరాశిలో శని తిరోగమనం వల్ల వృషభరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు మంచి జాబ్ వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. మీ కుటుంబంలో ఆనంద వెల్లివిరిస్తుంది. 

Also read: Aditya transit 2023: శుక్రుడి రాశిలో ఆదిత్యుడి సంచారం.. ఈ 3 రాశులకు కష్టకాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News