Shani Sade Sati 2023: ఆ మూడు రాశులకు 2025 మార్చ్ 29 వరకూ ఏం జరగనుంది. శని దోషం తప్పించే మార్గాలేంటి

Shani Sade Sati 2023: హిందూమత జ్యోతిష్యశాస్త్రంలో వివిధ గ్రహాలు, గ్రహాల గోచారాలకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శని గోచారం కూడా జీవితంలో కీలక మార్పు తీసుకొస్తుంది. కొన్నిరాశులపై శని సాడేసతి అంటే శని దశ ప్రారంభమైపోతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2023, 06:32 AM IST
Shani Sade Sati 2023: ఆ మూడు రాశులకు 2025 మార్చ్ 29 వరకూ ఏం జరగనుంది. శని దోషం తప్పించే మార్గాలేంటి

జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతం 3 రాశులపై శని సాడే సతి ప్రారంభమైంది. ఇది ఏకంగా 2025 వరకూ కొనసాగనుంది. శని సాడే సతి కారణంగా ఈ మూడు రాశుల జాతకులు మరో రెండేళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యల్ని ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. 

హిందూమత జ్యోతిష్యం ప్రకారం శనిని న్యాయదేవతగా పిలుస్తారు. ఎందుకంటే శనిగ్రహం చేసిన పనులు అంటే కర్మల్ని బట్టి ఫలమిస్తాడు. దాంతోపాటు శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. శని రాశి పరివర్తనానికి పట్టే సమయం ఏకంగా రెండున్నరేళ్లు. అందుకే ఏదైనా రాశిలో రెండవసారి చేరేందుకు శనిగ్రహానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుంటుంది. ఈ సమయంలో శని కుంభరాశిలో ఉన్నాడు. 30 ఏళ్ల తరువాత శని తన మూల త్రికోణ రాశిలో ఉండటం ఇదే. కుంభరాశిలో శని 29 మార్చ్ 2025 వరకూ ఉంటాడు. ఈ సందర్భంగా 3 రాశులపై శని సాడే సతి ప్రభావం 2 రాశులపై శని ఢయ్యా నడుస్తుంది. ఈ జాతకం వారికి మార్చ్ 2025 వరకూ చాలా కష్టాలుంటాయి. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. శని సాడేసతి కారణంగా ఏయే రాశులు 2025 వరకూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందో తెలుసుకుందాం..

2025 వరకూ ఈ రాశులకు అప్రమత్తత అవసరం

కుంభరాశి

శని కుంభరాశిలో ఉండటం వల్ల ఈ రాశివారికి శని సాడేసతి రెండవ పాదంపై నడుస్తోంది. సాడే సతి రెండవ పాదం అన్నింటికంటే క్లిష్టమైంది. ఈ జాతకులకు 2025 వరకూ శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. బంధాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కోపాన్నించి కాపాడుకోవాలి. లేకుంటే తీవ్ర కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

మకర రాశి

మకర రాశిపై 2025 వరకూ శని సాడేసతి మూడవ పాదముంటుంది. సాడే సతి మూడవ పాదం అంటే కొద్దిగా తక్కువ కష్టాలే ఉంటాయి కానీ లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఆరోగ్యంపై ధ్యాస ఉండాలి.

మీన రాశి

మీన రాశిపై 2025 వరకూ శని సాడేసతి  మొదటి పాదముంటుంది. ఈ సమయంలో ఈ జాతకులకు ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆర్ధిక సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో బంధాలు చెడిపోతాయి. జీవిత భాగస్వామికి పూర్తి సమయం కేటాయించాలి.

శని సాడేసతి నుంచి ఎలా ఉపశమనం పొందాలి

శని సాడే సతి సమయంలో కొన్ని ఉపాయాలు పాటించడం వల్ల శని దేవుడు ప్రసన్నుడౌతాడు. దాంతోపాటు శని గ్రహం సంతోషించే పనులు చేయాల్సి ఉంటుంది. పేదలు, ఆపన్నులకు సహాయం చేయాలి. కుక్కలు, పక్షులకు ఆహారం అందించాలి. దీనివల్ల శని సాడేసతి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా శనివారం నాడు కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది. 

ప్రతి శనివారం నాడు శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించాలి. దాంతోపాటు శనివారం సాయంత్రం రావిచెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం నాడు ఇనుప సామాను, నల్ల వస్త్రాలు, నల్ల మినపపప్పు, ఆవాల నూనె, చెప్పులు, షూస్ వంటివి దానం చేయాలి. శనివారం నాడు చేపలకు మేత పెట్టాలి. దీనివల్ల కుండలిలో శనిదోషం దూరమౌతుంది. 

Also read : Sun-Jupiter Transit 2023: 12 ఏళ్ల తరువాత కలవనున్న సూర్య, గురు గ్రహాలు, ఆ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News